Share News

Bharat Ratna Award 2024: పీవీ నర్సింహారావుకు భారత రత్న.. సోనియా గాంధీ రియాక్షన్ ఇదే..!

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:53 PM

Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

Bharat Ratna Award 2024: పీవీ నర్సింహారావుకు భారత రత్న.. సోనియా గాంధీ రియాక్షన్ ఇదే..!
Bharat Ratna Award List 2024

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ ముగ్గురు భారతదేశాభివృద్ధికి కోసం విశేష కృషి చేశారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం వీరికి భారత రత్న అవార్డు ప్రకటించి సత్కరించింది.

కాగా, పీవీ నరసింహారావు సహా ముగ్గురు ప్రముఖులకు భారత రత్న అవార్డు ఇవ్వడంపై స్పందించారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. ఈ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమెను మీడియా ప్రతినిథులు స్పందన కోరగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘వారికి భారత రత్న ఇవ్వడాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను.’ అని అన్నారు సోనియా గాంధీ.

పీవీతో సోనియా గాంధీకి వైరం..!

వాస్తవానికి పీవీ నరసింహారావు అంటే సోనియా గాంధీకి అస్సలు గిట్టదని రాజకీయాల్లో ఒక ప్రచారం ఉంది. అందుకే.. పీవీ అంత్యక్రియలకు సైతం కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరూ హాజరు కాలేదని, పీవీ భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకురావడానికి అనుమతించలేదని అంటారు. ఈ క్రమంలోనే.. పీవీకి భారతరత్న ఇవ్వడంపై సోనియా గాంధీ ఎలా స్పందిస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె చెప్పడంతో అందరి అటెన్షన్ అటువైపు మళ్లింది.

Updated Date - Feb 09 , 2024 | 03:53 PM