Share News

Bengaluru: బెంగళూరులో జార్ఖండ్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌..?

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:51 AM

జేఎంఎం, కాంగ్రెస్‌ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్‌ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

Bengaluru: బెంగళూరులో జార్ఖండ్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌..?

- 12 మంది ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

బెంగళూరు: జేఎంఎం, కాంగ్రెస్‌ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్‌ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కేబినెట్‌లో ఉన్న కాగ్రె్‌సకు చెందిన నలుగురు మంత్రులను ప్రస్తుత సీఎం కేబినెట్‌లోను కొనసాగించారు. ఈ నలుగురు మంత్రులూ ఎమ్మెల్యేల సమస్యలు పట్టించుకోవడం లేదని ఇతరులు వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం లేదా సీఎంపై ఎటువంటి కోపం లేదని మిగిలిన ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ కు చెందిన నలుగురు మంత్రులను మార్పు చేయాల్సిందేనని లేదంటే 12 మంది తడాఖా చూపుతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సమస్య వివరించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకురావాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీసీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సూచించినట్లు సమాచారం. అదే జరిగితే జార్ఖాండ్‌కు చెందిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు(Bengaluru)కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల వేళ కూడా బెంగళూరులోనే ఎమ్మెల్యేల క్యాంప్‌ సాగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటకలో పటిష్టమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటంతో పార్టీ సంక్షోభాలను ఇక్కడి నుంచే పరిష్కరించే ఆలోచనలో అగ్రనేతలు ఉన్నారు. బెంగళూరుకు రానిపక్షంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఎమ్మెల్యేలు గైర్హాజరయితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వ్యతిరేకతతో ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది.

pandu1.jpg

Updated Date - Feb 20 , 2024 | 01:37 PM