Share News

Terror Attack: సరిహద్దులో పేట్రేగిన ఉగ్రవాదులు.. ఆర్మీ సిబ్బందిపై కాల్పులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:05 PM

సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్(Jammu Kashmir) పూంచ్‌లో శుక్రవారం సాయంత్రం ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు దాడి(Terror Attack) చేశారు. అప్రమత్తమైన సైనికులు వారిపై ఎదురుకాల్పులు చేశారు. అయితే పరస్పర దాడుల్లో జరిగిన ప్రాణ నష్టంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.

Terror Attack: సరిహద్దులో పేట్రేగిన ఉగ్రవాదులు.. ఆర్మీ సిబ్బందిపై కాల్పులు

ఢిల్లీ: సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ము కశ్మీర్(Jammu Kashmir) పూంచ్‌లో శుక్రవారం సాయంత్రం ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు దాడి(Terror Attack) చేశారు. అప్రమత్తమైన సైనికులు వారిపై ఎదురుకాల్పులు చేశారు. అయితే పరస్పర దాడుల్లో జరిగిన ప్రాణ నష్టంపై సమాచారం ఇంకా తెలియరాలేదు. రాజౌరీస్ లో ఇటీవలే జరిగిన ఉగ్ర దాడిలో నలుగురు సైనికులు మరణించగా తాజా ఘటన రెండోది. పూంచ్ లోని ఖనేతర్ జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో ఘటన చోటుచేసుకుంది. అయితే 5 మంది ఈ దాడుల్లో గాయపడ్డారని సరిహద్దు భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు.

పిర్ పంజాల్ ప్రాంతంలో గడిచిన రెండేళ్లలో 35 మందికిపైగా సైనికులు మరణించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పాకిస్థాన్ సాయం చేస్తోందన్నారు. 2003కు ముందే ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని.. పాక్ సపోర్ట్ తో వారు మళ్లీ రెచ్చిపోతున్నారని అన్నారు. అయితే కాల్పులు ఇంకా ఆగలేదని సైన్యం పోరాడుతోందని వెల్లడించారు.

Updated Date - Jan 12 , 2024 | 08:05 PM