Share News

National: కొండ చరియల కింద ఊరు సమాధి

ABN , Publish Date - May 27 , 2024 | 03:37 AM

పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.

National: కొండ చరియల కింద ఊరు సమాధి

పపువా న్యూ గినియాలో 670 మందికి పైగా మృతి

పోర్ట్‌ మోర్స్బీ, మే 26: పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది. ఆ గ్రామంలో కొండ చరియలు విరిగిపడి 670 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 670 మంది చనిపోయినట్లు, 150కు పైగా ఇళ్లు సమాధయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - May 27 , 2024 | 03:37 AM