Share News

Luck now: రాజ్‌నాథ్‌కు పోటీగా 251 సార్లు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:29 AM

అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్‌లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

Luck now: రాజ్‌నాథ్‌కు పోటీగా 251 సార్లు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 28: అతనో నిత్య విద్యార్థి నాయకుడు. తన 40ఏళ్ల నాయకత్వ కెరీర్‌లో 251 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా... అతనిపై ఒక్కటంటే ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. అన్నీ ఏదో ఒక పోరాటంలో, నిరసన ప్రదర్శనలో పాల్గొని జైలుకు వెళ్లిన సందర్భాలే.


అతని పేరు రవిదాస్‌ మహ్రోత్రా. లఖ్‌నవూ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ రవిదాస్‌ ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అయినప్పటికీ రవిదాస్‌ తన విజయం పట్ల ధీమాగా ఉన్నాడు. రవిదాస్‌ 26 ఏళ్ల వయస్సులో లఖ్‌నవూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

Updated Date - Apr 29 , 2024 | 06:29 AM