Share News

Mobiles Usage: మితిమీరుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం.. బోస్టన్ నివేదికలో కీలక విషయాలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:05 AM

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం(Mobiles Usage) మితిమీరుతోందని బోస్టన్ నివేదిక వెల్లడించింది. అవసరం లేకున్నా సరాసరిగా ప్రతి 15 నిమిషాలకొకసారి ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.

Mobiles Usage: మితిమీరుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం.. బోస్టన్ నివేదికలో కీలక విషయాలు

ఢిల్లీ: దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం(Mobiles Usage) మితిమీరుతోందని బోస్టన్ నివేదిక వెల్లడించింది. అవసరం లేకున్నా సరాసరిగా ప్రతి 15 నిమిషాలకొకసారి ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(Boston Consulting Group) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఒక స్మార్ట్ ఫోన్ యూజర్ రోజుకు 70 - 80 సార్లు మొబైల్ తీసి నోటిఫికేషన్లు చెక్ చేసుకుంటున్నాడు. దాదాపు 55 శాతం మంది వినియోగదారులు తమ ఫోన్‌లను అకారణంగా తీస్తున్నారు. 50 శాతం మందికి తాము ఫోన్ తీయడానికి గల కారణం స్పష్టంగా తెలుసు.

సోషల్ మీడియా, షాపింగ్, రిసర్చ్, గేమింగ్ వంటివాటిని ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. దాదాపు 84 శాతం మంది వినియోగదారులు నిద్రలేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్లను చెక్ చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. వెయ్యి మంది వినియోగదారులపై ప్రయోగం నిర్వహించినట్లు బోస్టన్ తెలిపింది. మేలుకుని ఉన్నపుడు 31 శాతం సమయాన్ని స్మార్ట్‌ఫోన్లతోనే గడుపుతారని, రోజుకు సగటున 80 సార్లు తమ ఫోన్లను చెక్‌ చేస్తారని తెలిపింది.


కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేయడానికి దాదాపు 50 శాతం సమయాన్ని వెచ్చిస్తారని చెప్పింది. స్మార్ట్‌ఫోన్లతో గడిపే సమయం 2010లో దాదాపు రోజుకు రెండు గంటలు ఉండేదని, ఇప్పుడు ఇది 4.9 గంటలకు పెరిగిందని తెలిపింది.18-24 సంవత్సరాల మధ్య వయస్కులు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి షార్ట్‌ ఫార్మ్‌ వీడియోస్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపింది. ఈ అధ్యయనం 'సర్ఫేసెస్' అనే కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేసింది. ఇది AI టెక్నాలజీ లాక్ స్క్రీన్. ఇది యాప్‌కి నావిగేట్ చేయకుండానే వారి హోమ్ స్క్రీన్ నుంచి నేరుగా ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Updated Date - Feb 17 , 2024 | 08:06 AM