Share News

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

ABN , Publish Date - Mar 18 , 2024 | 08:20 AM

రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

జైపుర్: రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి. వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అజ్మీర్‌ స్టేషన్‌కు తరలించారు. నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని ప్రయాణికులు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)తో పాటు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM), సీనియర్ అధికారులు సహా రెస్క్యూ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. పట్టాలు తప్పిన కోచ్‌లను, ఇంజిన్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 08:28 AM