Share News

Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 1 గంట వరకూ 39.13 శాతం పోలింగ్

ABN , Publish Date - May 25 , 2024 | 02:11 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 39.13 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా 54.08 శాతం పోలింగ్ రికార్డయినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

Lok Sabha Elections 2024: మధ్యాహ్నం 1 గంట వరకూ 39.13 శాతం పోలింగ్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 39.13 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా 54.08 శాతం పోలింగ్ రికార్డయినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

Lok Sabha Polls 2024: నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..కారణం అదే..!


కాగా, బీహార్‌లో 36.48 శాతం పోలింగ్ నమోదు కాగా, హర్యానాలో 36.48, జమ్మూకశ్మీర్‌లో 35.11, జార్ఖాండ్‌లో 42.54, ఢిల్లీలో 34.37, ఒడిశాలో 35.69, ఉత్తరప్రదేశ్‌లో 37.23 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశ ఎన్నికల్లో మనోహర్ లాల్ ఖట్టార్, బన్సూరీ స్వరాజ్, మనోజ్ తివారీ, మేనకా గాంధీ, దినేష్ లాల్ యాదవ్, సంబిత్ పాత్ర, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్, అభిజిత్ గంగోపాధ్యాయ్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఢిల్లీ, హర్యానాలోని అన్ని పార్లమెంటరీ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. జూన్ 1న జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 02:20 PM