Share News

Jammu and Kashmir: లోయలో పడిన బస్సు: 21 మంది మృతి

ABN , Publish Date - May 30 , 2024 | 07:48 PM

జమ్ములో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. అయితే క్షతాగాత్రులను అఖ్నూర్‌లోని స్థానిక ఆసుపత్రికి, జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు జమ్ము ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Jammu and Kashmir: లోయలో పడిన బస్సు: 21 మంది మృతి

జమ్మూ కశ్మీర్, మే 30: జమ్ములో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. అయితే క్షతాగాత్రులను అఖ్నూర్‌లోని స్థానిక ఆసుపత్రికి, జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు జమ్ము ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Also Read: పోస్టాఫీసులకు క్యూ కడుతున్న మహిళలు ఎందుకుంటే..?


ఈ ఘటన జమ్ము- పూంచ్ రహదారిపై చోటు చేసుకుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస నుంచి జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని శివ్ ఖోరి పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

Also Read: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు

Also Read: మోదీ ధ్యానం‌పై ఈసీకి లేఖ

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 08:48 PM