Share News

12th Fail: రియల్ హీరోను కలిసిన రీల్ హీరో.. ఐపీఎస్ మనోజ్ శర్మను కలిసిన విక్రాంత్..

ABN , Publish Date - Jan 30 , 2024 | 04:23 PM

చిన్న సినిమాగా విడుదలై మౌత్ టాక్‌తో అతిపెద్ద విజయం సాధించిన చిత్రం ``12th ఫెయిల్``. మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ``12th ఫెయిల్`` సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు.

12th Fail: రియల్ హీరోను కలిసిన రీల్ హీరో.. ఐపీఎస్ మనోజ్ శర్మను కలిసిన విక్రాంత్..

చిన్న సినిమాగా విడుదలై మౌత్ టాక్‌తో అతిపెద్ద విజయం సాధించిన చిత్రం ``12th ఫెయిల్`` (12th Fail). మ‌నోజ్ కుమార్ (IPS Manoj Kumar) అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ``12th ఫెయిల్`` సినిమాలో విక్రాంత్ మస్సే (Vikrant Massey) హీరోగా నటించాడు. కేవలం రూ.20 కోట్లతో విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది. ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో నటనకు గానూ విక్రాంత్ మస్సే.. ఉత్తమ నటుడి (క్రిటిక్స్) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న అనంతరం రియల్ హీరో మనోజ్ శర్మను విక్రాంత్ కలిశారు. అతడితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను మనోజ్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ``ఒక మనోజ్ తన ఫిల్మ్‌ఫేర్ ట్రోఫీని మరొక మనోజ్‌కి అందించినప్పుడు, అతను మరింతగా ప్రేమలో పడతాడు`` అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. 2.4 లక్షల మందికి పైగా ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఇద్దరు మనోజ్‌లపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

పేద కుటుంబానికి చెందిన మ‌నోజ్ కుమార్ 12వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ అవుతాడు. పొట్ట‌కూటి కోసం ఆటో డ్రైవ‌ర్‌గా పని చేస్తాడు. పేదరికాన్ని ఎదురించి ఐపీఎస్‌గా సెలెక్ట్ అవడం వరకు మనోజ్ ఇన్‌స్పైరింగ్‌ జర్నీని డైరెక్ట‌ర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ సినిమాలో ఆవిష్కరించారు. అంతేకాదు మన విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాలతో పాటు సివిల్స్ కోసం స‌న్న‌ద్ద‌మ‌య్యే పేద విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను హృద్యంగా తెరకెక్కించారు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

Updated Date - Jan 30 , 2024 | 04:23 PM