Share News

Miss Universe: చరిత్ర సృష్టించిన ఆ దేశం.. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో!

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:00 PM

ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే ఈ మోడల్.. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లో పాల్గొంది. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. ప్రామాణికమైన సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.

Miss Universe: చరిత్ర సృష్టించిన ఆ దేశం.. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో!

ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) ఓ చారిత్రాత్మక అడుగు వేయబోతోంది. చరిత్రలో తొలిసారి మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ పోటీల్లో రూమీ అల్‌ఖహతానీ (Rumy Alqahtani) అనే మోడల్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రూమీ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాంగా తెలిపింది. ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే మొదటి వ్యక్తిని తానేనని తెలిపింది. నిజానికి.. సౌదీ అరేబియాలో మహిళల దుస్తుల విషయంలో ఎన్నో ఆంక్షలు ఉంటాయి. బాడీ మొత్తం కవర్ అయ్యేలా దుస్తులు ధరించడంతో పాటు హిజాబ్ తప్పనిసరి వంటి నిబంధనల్ని పాటించాలి. అలాంటి దేశం ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ (Mohammed bin Salman Al Saud) ఆధ్వర్యంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోతుండటం విశేషం.

Sunita Kejriwal: ఢిల్లీలో బిహార్ సీన్ రిపీట్.. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య!


అసలు ఎవరు ఈ రూమీ అల్‌ఖహతానీ?

రూమీ సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు (Riyadh) చెందింది. ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే ఈ మోడల్.. కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లో పాల్గొంది. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడం.. ప్రామాణికమైన సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. మిస్ సౌదీ అరేబియా కిరీటంతో పాటు మిస్ మిడిల్ ఈస్ట్, మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ టైటిళ్లను రూమీ సొంతం చేసుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్‌కు ఫాలోవర్స్ కలిగిన ఈ మోడల్.. ఇప్పుడు మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనబోతున్నందుకు తన ఉత్సాహాన్ని పంచుకుంది. అలాగే.. మలేషియాలో జరిగిన మిస్ ఆసియా ఇంటర్నేషనల్ 2024 పోటీలో పాల్గొన్నందుకు తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణలు

చాలాకాలంగా సంప్రదాయవాదానికి పేరుగాంచిన సౌదీ అరేబియా ప్రస్తుతం 38 ఏళ్ల క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో పరివర్తన చెందుతోంది. గత కొన్ని నెలల నుంచి కఠినమైన ఆంక్షలు సడలించబడుతున్నాయి. ప్రత్యేకంగా.. మహిళలపై పరిమితుల్ని తొలగించారు. డ్రైవింగ్ చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. అలాగే.. మిక్స్‌డ్-జెండర్ ఈవెంట్లకు హాజరు కావొచ్చు. పురుష సంరక్షకత్వం లేకుండానే పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముస్లిమేతర దౌత్యవేత్తలకు మద్యం కొనుగోలు చేసే అనుమతిని సైతం అంగీకరించింది. ఈ మార్పు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Conductor: కండక్టర్ కావరం.. మహిళపై చేయి చేసుకొని, ఆపై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 27 , 2024 | 05:00 PM