Share News

Viral News: ఆ మహిళ పాలిట శాపంగా మారిన దుస్తులు.. వాటిని విప్పేయాలంటూ..

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:05 PM

పాకిస్తాన్‌లో (Pakistan) ఒక మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను వేసుకున్న దుస్తులే ఆమెని ఊహంచని ఇబ్బందుల్లో నెట్టేశాయి. ఆ దుస్తులు చూసి కోపాద్రిక్తులైన కొందరు జనాలు.. ఆమెని చుట్టుముట్టి దాడి చేయబోయారు. చివరికి.. ఓ మహిళా పోలీసు అధికారి రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Viral News: ఆ మహిళ పాలిట శాపంగా మారిన దుస్తులు.. వాటిని విప్పేయాలంటూ..

పాకిస్తాన్‌లో (Pakistan) ఒక మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను వేసుకున్న దుస్తులే ఆమెని ఊహంచని ఇబ్బందుల్లో నెట్టేశాయి. ఆ దుస్తులు చూసి కోపాద్రిక్తులైన కొందరు జనాలు.. ఆమెని చుట్టుముట్టి దాడి చేయబోయారు. చివరికి.. ఓ మహిళా పోలీసు అధికారి రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆమె పుణ్యమా అని ఆ మహిళ బతికి బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


అసలు ఏమైందంటే.. సైదా షెహర్‌బానో నఖ్వీ (Syeda Shehrbano Naqvi) అనే మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ కోసం బయటకు వెళ్లింది. ఆమె కుర్తా ధరించగా.. దానిపై అరబిక్ అక్షరాల్లో కొన్ని పదాలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. ఇది చూసిన కొందరు వ్యక్తులు.. ఆ అక్షరాలు పవిత్రమైన ఖురాన్‌కి సంబంధించినవిగా భావించి, ఆమెను చుట్టుముట్టారు. మతపరమైన మనోభావాల్ని దెబ్బతీస్తే సహించలేదే లేదని, కుర్తాను తీసేసి వేరే దుస్తులు వేసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఇది గమనించిన ఓ మహిళా పోలీస్ అధికారి వెంటనే ముందుకొచ్చి.. సైదాను రక్షించింది. ఒక మహిళపై ఇలా దాడికి దిగడం సమంజసం కాదని ఆ వ్యక్తులను శాంతింపజేసి.. సైదాను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది.

మరోవైపు.. సైదా షెహర్‌బానో స్టేషన్‌లో తన దుస్తుల గురించి వివరణ ఇచ్చుకుంది. తాను వేసుకున్న దుస్తుల వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతిని ఉంటే, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. ఎవరి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, కుర్తా డిజైన్ నచ్చడం వల్లే తాను కొననుగోలు చేశానని పేర్కొంది. కాగా.. ఈ ఘటనలో మహిళా పోలీస్ అధికారి కనబర్చిన ధైర్యసాహసాలపై ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఓ జర్నలిస్ట్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఆ మహిళా అధికారి ఒక స్టార్ అని, మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో ఆమె చాటిచెప్పిందని కొనియాడారు.

Updated Date - Feb 26 , 2024 | 04:05 PM