Pakistan: పార్లమెంట్‌లో పిల్లుల నియామకం కోసం కొత్త పథకం..
ABN , Publish Date - Aug 20 , 2024 | 06:37 PM
ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మరో కొత్త కష్టం వచ్చి పడింది. దీంతో పార్లమెంట్‌లో పిల్లులను పెంచాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మరో కొత్త కష్టం వచ్చి పడింది. దీంతో పార్లమెంట్‌లో పిల్లులను పెంచాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ పార్లమెంట్‌లో ఎలుకల సంఖ్య పెరిగిపోయాయట. గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో ఎలుకల పార్లమెంట్ భవనంలో ఉండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ఎలుకల సమస్యను నివారించడానికి పిల్లులను పెంచాలని నిర్ణయించింది. ఈ పథకానికి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రూ. 1.2 మిలియన్లు అంటే దాదాపు రూ. 12 లక్షల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కొన్ని పిల్లులను పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు. అవి ఎలుకలను పట్టుకుని చంపనున్నాయి. ఎలుకల బెడద పెరిగి పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుండటంతో పాక్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎలుకలు పార్లమెంట్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లను పాడు చేస్తుండటంతో వాటి నివారణకు పిల్లులను పార్లమెంట్‌లో నియమించాలని నిర్ణయం తీసుకుంది.
Joe Biden: కళ్లు చెమర్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎందుకంటే?
సమస్యకు పరిష్కారం..
పిల్లులను పార్లమెంట్‌లో ఉంచితే ఎలుకల సమస్య తీరడమే కాకుండా సహజసిద్ధమైన, పర్యావరణ హితమైన పద్ధతి కూడా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలుకలను చంపేందుకు పిల్లులకు శిక్షణ ఇచ్చి పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు. ఈ పథకం వినడానికి వింతగా అనిపించినా.. తీవ్రమైన సమస్యకు పరిష్కార మార్గమని పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
Kamala Harris: కమలా హ్యారీస్ సర్‌ప్రైజ్ ప్రసంగం.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు
గతంలోనూ..
గతంలోనూ పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఎలుకల సమస్య ఉంది, కానీ ప్రస్తుతం ఆ సమస్య తీవ్రతరమైంది. దానిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉండటంతో పిల్లుల రిక్రూట్‌మెంట్ పథకాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఎలుకల సమస్యను ఎదుర్కోవడానికి ఇది సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన మార్గమని అధికారులు చెబుతున్నారు.
Kamala Harris: కమలా హ్యారిస్‌కు గుడ్‌న్యూస్.. తాజా సర్వే ఏం చెబుతోందంటే?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More International News and Latest Telugu News