Share News

Pakistan deadlock: నవాజ్‌కు మార్గం సుగమం.. పీఎం రేసు నుంచి తప్పుకున్న బిలావల్ భుట్టో

ABN , Publish Date - Feb 13 , 2024 | 09:22 PM

పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభనకు తెరపడే అవకాకాశాలు కనిపిస్తున్నాయి. నవాజ్ షరీప్ నాలుగోసారి దేశ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగయ్యాయి.

Pakistan deadlock: నవాజ్‌కు మార్గం సుగమం.. పీఎం రేసు నుంచి తప్పుకున్న బిలావల్ భుట్టో

ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తలెత్తిన ప్రతిష్ఠంభనకు తెరపడే అవకాకాశాలు కనిపిస్తున్నాయి. నవాజ్ షరీప్ (Nawaz Sharif) నాలుగోసారి దేశ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగయ్యాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నేత బిలావల్ భుట్టో జర్దారీ (Bilaval Bhutto Jardari) తమ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)కు మద్దతివ్వనున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. నవాజ్ షరీప్ సారథ్యంలోని పీఎంఎల్‌-ఎన్ ప్రతిపాదించిన అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే, మంత్రివర్గంలో తమ పార్టీ చేరేదిలేదని స్పష్టం చేశారు.


''ప్రధానిని ఎన్నుకోవడం, ప్రభుత్వం ఏర్పాటులో విఫలమైతే తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందువల్ల మరో రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చు. ప్రభుత్వంలో మంత్రి పదవులను మేము తీసుకోం. అంశాల వారీగానే మా మద్దతు ఉంటుంది'' అని భుట్టో తెలిపారు. తన తండ్రి, దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలి జర్దారీ అన్ని విధాలా పాక్ అధ్యక్ష పదవికి అర్హులని ఓ ప్రశ్నకు సమాధానంగా బిలావల్ చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల నుంచి బయటపడేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారు. మరోవైపు తన పెద్ద సోదరుడు నవాజ్ షరీప్ పాక్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నట్టు ఆయన సోదరుడు, మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్ తెలిపారు.

Updated Date - Feb 13 , 2024 | 09:22 PM