Share News

Air Hostess: ఎయిర్‌లైన్స్‌కే షాకిచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే!

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:19 PM

ఆమె ఒక ఎయిర్ హోస్టెస్ (Air Hostess).. ఎప్పట్లానే ఆరోజు కూడా తన విధులకు హాజరైంది.. అందరితోనూ స్నేహపూర్వకంగానే మెలిగింది.. విమానం ల్యాండ్ అయ్యేదాకా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.. కానీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా పెద్ద షాకిచ్చింది. ఆమె ఇచ్చిన ఝలక్‌కి విమానయాన సంస్థే కదిలిపోయింది.

Air Hostess: ఎయిర్‌లైన్స్‌కే షాకిచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే!

ఆమె ఒక ఎయిర్ హోస్టెస్ (Air Hostess).. ఎప్పట్లానే ఆరోజు కూడా తన విధులకు హాజరైంది.. అందరితోనూ స్నేహపూర్వకంగానే మెలిగింది.. విమానం ల్యాండ్ అయ్యేదాకా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.. కానీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా పెద్ద షాకిచ్చింది. ఆమె ఇచ్చిన ఝలక్‌కి విమానయాన సంస్థే కదిలిపోయింది. ‘థాంక్యూ’ అనే నోట్ పెట్టి, తన యూనిఫామ్‌ని వదిలేసి.. కంటికి కనిపించకుండా మాయమైంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ ఈ పని చేసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే..


మరియం రజా (Maryam Raza) అనే మహిళ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (Pakistan International Airlines - PIA)లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. 15 ఏళ్ల క్రితం ఈ రంగంలో అడుగుపెట్టిన ఆమె.. సోమవారం (26/02/24) ఇస్లామాబాద్ (Islamabad) నుంచి కెనడాలోని టొరంటోకు (Toranto) వెళ్లిన పీకే-782 విమానంలో తన విధులు నిర్వర్తించింది. అయితే.. కరాచీకి తిరిగెళ్లే పీకే-784 విమానంలో ఆమె విధులకు హాజరవ్వలేదు. ఆమెను ఎన్ని విధాలుగా సంప్రదించినా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో.. ఆమెకు కేటాయించిన హోటల్ గదికి వెళ్లి చూశారు. అక్కడ తన యూనిఫామ్‌తో పాటు ‘థాంక్యూ పీఐఏ’ అనే నోట్ లభించింది. ఇది చూశాక.. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్లిపోయిందని గ్రహించారు.

ఇలా పీఐఏ ఎయిర్ హోస్టెస్ అదృశ్యం అవ్వడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ చాలామంది మిస్ అయ్యారు. కెనడాలో (Canada) ల్యాండ్ అయ్యాక వాళ్లు అదృశ్యమయ్యారు. 2019 నుంచి ఈ మిస్సింగ్ ట్రెండ్ ప్రారంభమైంది. గతేడాదిలో మొత్తం ఏడుగురు ఎయిర్ హోస్టెస్‌లో అదృశ్యమవ్వగా.. ఈ ఏడాదిలో ఇద్దరు మిస్ అయినట్లు ఓ నివేదిక తెలిపింది. పాకిస్తాన్‌లో పరిస్థితులు దుర్భరంగా ఉండటం, కెనడియన్ చట్టం అనుకూలంగా ఉండటమే.. ఎయిర్ హోస్టెస్‌ల అదృశ్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కెనడాలో స్థిరపడ్డారని సమాచారం.

Updated Date - Feb 29 , 2024 | 03:19 PM