Share News

Lucky Indian: యూఏఈలో భారతీయ డ్రైవర్‌కు అదృష్టం..లాటరీలో గెల్చుకున్న రూ.44 కోట్లు

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:50 PM

యూఏఈలో తరచుగా లాటరీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మంది వాటిని కొనుగోలు చేసి వారి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయులు అక్కడ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేయగా వారికి కోట్ల రూపాయల బహుమతి దక్కింది.

Lucky Indian: యూఏఈలో భారతీయ డ్రైవర్‌కు అదృష్టం..లాటరీలో గెల్చుకున్న రూ.44 కోట్లు

UAEలో గత అనేక సంవత్సరాలుగా ఉంటున్న ఓ భారతీయుడికి అదృష్టం వరించింది. అతను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌(lottery ticket)కు ఏకంగా రూ.44 కోట్లు లభించాయి. డిసెంబర్ 31, 2023న UAEలో జరిగిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో అతను ఈ మొత్తం గెల్చుకున్నాడు. అతని పేరు మునవర్ ఫైరూస్ కాగా..అల్ ఐన్ నగరంలో అతను ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆ మొత్తం బహుమతికి ఫైరూస్ ఒక్కరే విజేత కాదని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. మరో 30 మందితో కలిసి అతను ఆ టిక్కెట్టు కొనుగోలు చేశారని వెల్లడించింది. దీంతో ఆ మొత్తాన్ని 30 మంది కలిసి పంచుకోనున్నారు.


అయితే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తారని అతన్ని అడుగగా తాను లాటరీ గెల్చుకుంటానని ఊహించలేదని చెప్పాడు. అంతేకాదు ఇప్పటికీ అతను గెల్చుకున్నానని చెబితే ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను వచ్చే మొత్తాన్ని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నానని వెల్లడించారు. అంతేకాదు అదే రోజు మరో ఇండియన్(indian) సుతేష్ కుమార్ కుమరేసన్ 1 మిలియన్ దిర్హమ్‌లు(రూ.2,26,84,142.75) గెల్చుకున్నారు. అతను అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీంతో సుతేష్ చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఆ వచ్చిన మొత్తంతో భారతదేశంలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు అతను తీసుకున్న అప్పులు తీర్చనున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - Jan 02 , 2024 | 05:50 PM