Share News

Israel vs Iran: సిరియాపై ప్రతీకార దాడి చేసిన ఇజ్రాయెల్.. క్షిపణులతో విరుచుకుపడి విధ్వంసం

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:15 PM

ఐక్యరాజ్యసమితి(UNO) సూచనలు బేఖాతరు చేస్తూ.. ఇరాన్‌పై(Iran) ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ దేశంపై శుక్రవారం ప్రతీకార దాడికి దిగింది. ఇవాళ ఉదయాన్నే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా నివేదించింది.

Israel vs Iran:  సిరియాపై ప్రతీకార దాడి చేసిన ఇజ్రాయెల్.. క్షిపణులతో విరుచుకుపడి విధ్వంసం

బీరుట్: ఐక్యరాజ్యసమితి(UNO) సూచనలు బేఖాతరు చేస్తూ.. సిరియాపై(Iran) ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ దేశంపై శుక్రవారం ప్రతీకార దాడికి దిగింది. ఇవాళ ఉదయాన్నే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా నివేదించింది. ఇరాన్‌లోని కీలకమైన ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.

సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో.. "ఇజ్రాయెల్(Israel) క్షిపణులను ఉపయోగించి దాడి చేసింది. దక్షిణ ప్రాంతంలోని మా వైమానిక రక్షణ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విధ్వంసం సృష్టించింది" అని తెలిపింది.


సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దక్షిణ ప్రావిన్స్ దరాలో ఆర్మీ రాడార్ పొజిషన్‌ను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. సిరియా గగనతలంలో ఇజ్రాయెల్ విమానాల ప్రవేశాన్ని తాము గుర్తించామన్నారు.

బ్రిటన్ ఆధారిత అబ్జర్వేటరీ అధిపతి రామి అబ్దేల్ రెహమాన్ మాట్లాడుతూ.. సిరియా వైమానిక రక్షణ దళాలు ఎలాంటి దాడులకు పాల్పడకముందే ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులకు దిగిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ సైన్యం 2011లోకూడా ఇరాన్ మద్దతుగల యోధులను లక్ష్యంగా చేసుకుని సిరియాలో వందల సంఖ్యలో దాడులు చేసింది.


తిప్పికొట్టిన ఇరాన్..

ఓ వార్త సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పిట్టాయి. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ముందు జాగ్రత్తగా గగనతలాన్ని మూసేసింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.

ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి ప్రావిన్సుల్లో ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో ఇందుకు సాయం చేసింది.

సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే దాడికి సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కాస్‌లోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ఇజ్రాయెల్‌ కారణమని భావించినందునే ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇరు దేశాల ఘర్షణ వైఖరితో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 06:24 PM