Share News

America: వారం రోజుల వ్యవధిలో మరొకరు.. అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి

ABN , Publish Date - Feb 01 , 2024 | 09:51 PM

అగ్రరాజ్యం అమెరికాలో(America) వరుసగా భారతీయ విద్యార్థులు(Indian Students) మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

America: వారం రోజుల వ్యవధిలో మరొకరు.. అమెరికాలో భారతీయ విద్యార్థి మృతి

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో(America) వరుసగా భారతీయ విద్యార్థులు(Indian Students) మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిన్సినాటీలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు భారతీయ విద్యార్థులు చనిపోవడం గమనార్హం.

సైనీ అనే యువకుడిని జనవరి చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. 2023 నవంబర్‌లో సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఆదిత్యను.. ఒహియో నగరంలో కాల్చి చంపారు. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 18 ఏళ్ల అకుల్ ధావన్‌ జనవరిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించారు. ఇలా వరుసగా అనుమానాస్పద మరణాలు సంభవించడం.. అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2024 | 09:53 PM