Share News

Indian Plane Crash: ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన విమానం.. ఆ మిస్టరీపై ప్రభుత్వం క్లారిటీ

ABN , Publish Date - Jan 21 , 2024 | 03:32 PM

ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని ఆఫ్ఘన్ స్థానిక మీడియా వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆఫ్ఘన్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే.. అది భారతీయ షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్ విమానం గానీ, చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కానీ కాదు.

Indian Plane Crash: ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన విమానం.. ఆ మిస్టరీపై ప్రభుత్వం క్లారిటీ

ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని ఆఫ్ఘన్ స్థానిక మీడియా వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆఫ్ఘన్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే.. అది భారతీయ షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్ విమానం గానీ, చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కానీ కాదు. అది మొరాకోకి చెందిన ఒక చిన్న విమానం. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ఎక్స్ వేదికగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


కాగా.. శనివారం రాత్రి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో (చైనా, తజికిస్థాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతం ఇది) ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రాష్ గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. తొలుత ఇది భారత్‌కి చెందిన విమానం అయ్యుండొచ్చని వాళ్లు భావించారు. బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ విమానం కూలిందని, అయితే ప్రమాదం జరిగిన స్థలం గురించి కచ్ఛితమైన సమాచారం ఇంకా తెలియరాలేదని ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక శాఖ అధికారి జబీహుల్లాని అమీరిని ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. అయితే.. ఇది భారత్‌కు చెందింది కాదని, మొరాకోలో రిజిస్టర్‌ చేయబడిన చిన్న విమానమని భారత ప్రభుత్వం వివరించింది.

మరోవైపు.. ఈ క్రాష్ గురించి సమాచారం అందిన వెంటనే రష్యన్ ఏవియేషన్ అధికారులు ఒక స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఆరుగురు వ్యక్తులతో నిండిన రష్యన్-రిజిస్టర్డ్ విమానం ఆఫ్ఘనిస్తాన్‌లోకి ఎంటరయ్యాక తమ రాడార్ స్క్రీన్స్ నుంచి అదృశ్యమైందని పేర్కొన్నారు. ఇదొక చార్టర్ అంబులెన్స్ ఫ్లైట్ అని.. 1978లో తయారుచేయబడిన ఈ విమానం పేరు డస్సాల్ట్ ఫాల్కన్ 10 అని.. ఇది ఉజ్బెకిస్తాన్ మీదుగా భారత్ నుంచి మాస్కోకి బయలుదేరిందని వెల్లడించారు. మరి.. భారత ప్రభుత్వం చెప్పినట్టు ఇది మొరాకోకి చెందిందా? లేదా రష్యన్ అధికారులు గల్లంతైనట్టు భావిస్తున్న విమానమా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 21 , 2024 | 03:32 PM