Share News

Watch Video: టోక్యో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.. 367 మంది..

ABN , Publish Date - Jan 02 , 2024 | 03:42 PM

Japan Flight Fire Video: జపాన్ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన జేఏఎల్ 516 మంగళవారంనాడు ప్రమాదానికి గురైంది. టోక్యోలోని హనేడా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. విమానం విండోల నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి.

Watch Video: టోక్యో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు..  367 మంది..

టోక్యో: జపాన్ ఎయిర్‌లైన్స్‌ (Japain Airlines)కు చెందిన జేఏఎల్ 516 మంగళవారంనాడు ప్రమాదానికి గురైంది. టోక్యో (Tokyo) లోని హనేడా (Haneda) విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. విమానం విండోల నుంచి మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రాణనష్టంపై ఇంతవరకూ సమాచారం లేనప్పటికీ విమానంలో 367 మంది వరకూ ప్రయాణిస్తున్నట్టు జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హొక్కైడో విమానాశ్రయంలో జేఏఎల్ విమానం బయలుదేరి వచ్చింది. కాగా, విమానం రన్‌వైపే దిగుతున్నప్పుడు అక్కడే ఉన్న కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీకొన్నట్టు అనుమానిస్తున్నట్టు నిప్పోన్ టీవీ తెలిపింది. సహాయక చర్యలు జరుగుతున్నాయని పేర్కొంది.

Updated Date - Jan 02 , 2024 | 03:49 PM