Share News

jackfruit seeds: పనస గింజలు తింటే.. ఇన్ని లాభాలా..! తెలిస్తే ఇక అస్సలు పడేయరు..

ABN , Publish Date - Nov 30 , 2024 | 02:07 PM

పనస పండు.. దాదాపు అందరికీ తెలుసు.. పనస పండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలా మంది పనస పండు తిని గింజలు పక్కన పడేస్తుంటారు. ఈ పనస గింజల వల్ల కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

jackfruit seeds: పనస గింజలు తింటే.. ఇన్ని లాభాలా..! తెలిస్తే ఇక అస్సలు పడేయరు..

పనస పండు.. దాదాపు అందరికీ తెలుసు.. పనస పండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలా మంది పనస పండు తిని గింజలు పక్కన పడేస్తుంటారు. ఈ పనస గింజల వల్ల కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పనస గింజల వల్ల ఉపయోగాలు..

పనస గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్ విటమిన్లు A,C,E,B, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.


మలబద్ధకాన్ని నివారించడంలో సహకరిస్తాయి..

పనస గింజలలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సాయం చేస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పనస గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించేలా చేస్తాయి.


గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి..

పనస గింజలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. పనస గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజాలు. పొటాషియం రక్తనాళాలను సడలించి గుండె వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుందని వివరిస్తున్నారు.


బరువు తగ్గడంలో సహాయపడతాయి..

బరువు తగ్గాలనుకునే వారికి పనస గింజలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పనస పండు గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్రరక్తకణాలను పెంచడంలో ఉపయోగపడుతుంది.


జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

పనస గింజలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇవి ముడతలను తగ్గించడం, జుట్టు రాలడాన్ని నివారించడంలో సాయపడతాయి.


ఈవార్తను కూడా చదవండి:

https://www.andhrajyothy.com/2024/health/how-to-take-care-of-your-skin-in-winter-ksv-1338822.html

https://www.andhrajyothy.com/2024/health/are-you-suffering-from-cold-and-cough-problem-follow-these-tips-sj-1341359.html

Updated Date - Nov 30 , 2024 | 02:07 PM