Share News

Holi Hair Care: ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. హోలీ రంగుల నుంచి మీ జుట్టు సేఫ్..!

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:53 AM

హోలీ రంగులతో చాలామందికి చర్మ, జుట్టు సంబంధ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ 5 సింపుల్ టిప్స్ తో జుట్టు సేఫ్..

Holi Hair Care: ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. హోలీ రంగుల నుంచి మీ జుట్టు సేఫ్..!

హోలీ పండుగ భారత్ లో అందరూ ఎంతో సంతోషంగా, ఘనంగా జపుపుకునే రంగుల పండుగ. ఈ పండుగ వెనుక ఎంత సరదా.. సంతోషం ఉన్నప్పటికీ రంగుల కారణంగా ఆరోగ్యపరంగా కూడా అంతే సమస్యలుంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధ సమస్యలు, జుట్టుకు సంబంధించిన సమస్యలు హోలీ సందర్భంగా ఎదురవుతాయి. హోలీలో రంగులు చల్లుకున్న తరువాత జుట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే హోలీకి ముందు.. తరువాత.. ఈ 5 సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి..

ఆయిల్ మసాజ్..

హోలీ పండుగకు ముందు జుట్టుకు ఆయిల్ తో బాగా మసాజ్ చేయాలి. ఇందుకోసం కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా మరే ఇతర నూనెలు అయినా వాడొచ్చు. ఇవి రంగులు జుట్టు లోతుగా వెళ్లకుండా నిలువరిస్తాయి. జుట్టు కుదుళ్లకు పట్టేలా ఆయిల్ మసాజ్ చేసిన అనంతరం హోలీ రంగులతో ఎంజాయ్ చేయవచ్చు.

ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!


గోరువెచ్చని నీరు..

హోలీ సందర్భంగా రంగులు చల్లుకున్న తరువాత జుట్టుకు అంటిన రంగులు తొలగించడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. అంతేకానీ అధిక వేడి కలిగిన నీటిని ఉపయోగించకూడదు. అధిక వేడి ఉన్న నీరు జుట్టు కుదుళ్ళలో ఉన్న సహజ నూనెలు తీసివేస్తుంది. గోరువెచ్చని నీరు జుట్టుకు హాని కలిగించకుండా రంగులను సున్నితంగా తొలగించడంలో సహాయపడుతుంది.

షాంపూ.. కండీషనర్..

హోలీ తర్వాత జుట్టును శుభ్రం చేయడానికి తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూలని ఎంచుకోవాలి. కఠినమైన షాంపూల వల్ల జుట్టు డ్యామేజ్ పెరుగుతుంది. షాంపూను నీటిలో కలిపి జుట్టుకు పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. అలాగే షాంపూ తరువాత జుట్టుకు కండీషనర్ రాయడం మరవకూడదు.

ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!

హెయిర్ మాస్క్..

హోలీ రంగుల నుండి జుట్టును తిరిగి దృఢంగా మార్చుకోవడానికి జుట్టుకు సహజమైన హెయిర్ మాస్క్ లతో ట్రీట్మెంట్ ఇవ్వాలి. పెరుగు, తేనె, కలబంద, గుడ్డు వంటి వాటితో జుట్టుకు హెయిర్ మాస్క్ వేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టుకు పోషకాలు కూడా అందుతాయి. డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేస్తాయి.

చిట్కాలు..

రంగులు వదిలించుకోవడానికి జుట్టును వాష్ చేసిన తరువాత జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును చిక్కులు పడకుండా జాగ్రత్తగా విడదీయాలి. అలాగే వెడల్పు పళ్లున్న దువ్వెనతో సున్నితంగా దువ్వాలి. టవల్ తో గట్టిగా రుద్దడం, జుట్టును గట్టిగా విదల్చడం మానుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 11:15 AM