Share News

Health Tips: గర్భవతులలో మార్నింగ్ సమస్యా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:19 PM

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో, సుమారు 13 వారాల పాటు భావోద్వేగాలు క్కువగా ఉంటాయి. ఆనందం, ఉత్సుకత, ఆందోళన, భయం వంటి అన్ని భావోద్వేగాలు మనస్సులో ఉంటాయి. ఈ నెలలలో వాంతులు, వికారం, ఆహారం చూసిన తర్వాత వికారం, మానసిక కల్లోలం, ఒత్తిడి మొదలైనవి ఉంటాయి. ఈ లక్షణాలను మార్నింగ్ సిక్‌నెస్ అంటారు.

Health Tips: గర్భవతులలో మార్నింగ్ సమస్యా? ఈ టిప్స్ ఫాలో అయితే సరి..!

గర్భం దాల్చడం అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆహ్లాదకరమైన దశ. ఈ సమయంలో మహిళలు అనేక శారీరక, మానసిక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటన్నింటి వల్ల చాలా మంది మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య మార్నింగ్ సిక్ నెస్. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో, సుమారు 13 వారాల పాటు భావోద్వేగాలు క్కువగా ఉంటాయి. ఆనందం, ఉత్సుకత, ఆందోళన, భయం వంటి అన్ని భావోద్వేగాలు మనస్సులో ఉంటాయి. ఈ నెలలలో వాంతులు, వికారం, ఆహారం చూసిన తర్వాత వికారం, మానసిక కల్లోలం, ఒత్తిడి మొదలైనవి ఉంటాయి. ఈ లక్షణాలను మార్నింగ్ సిక్‌నెస్ అంటారు. పది మంది స్త్రీలలో ఏడుమంది ఈ మార్నింగ్ సిక్ నెస్ తో ఇబ్బంది పడతారు. మార్నింగ్ సిక్నెస్ లక్షణాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుంటే..

మార్నింగ్ సిక్ నెస్ తగ్గించుకోవడం ఎలాగంటే..

ఆకలితో ఉండకూడదు. ఖాళీ కడుపు కారణంగా గర్భధారణ హార్మోన్లు మరింత చురుకుగా మారతాయి. వాటి లక్షణాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది. గర్భవతులకు అదనపు కేలరీలు అవసరమని దీని అర్థం కాదు. అందుకే ఆకలిగా అనిపించినప్పుడు కాల్చిన మఖానా, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాలి. ఆకలి అనిపిస్తే ఎక్కువసేపు ఉండకూడదు. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ తినడానికి బదులుగా, చిన్న మొత్తాలు ఎక్కువ సార్లు తినాలి.

పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!


మెగ్నీషియం లోపం కూడా మార్నింగ్ సిక్నెస్‌కు కారణమవుతుంది. ఆకు కూరలు, పప్పులు, గింజలు వంటి మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న వాటిని తీసుకోవాలి.

అల్లం టీ, లేదా తాజా అల్లం వాసన చూడటం వల్ల వాంతులు, వికారం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం, నిమ్మరసం, తేనె యొక్క కలిపి డిటాక్స్ నీటిని తయారుచేసుకుని త్రాగవచ్చు.

మార్నింగ్ సిక్‌నెస్‌లో ఆక్యుప్రెషర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

విటమిన్ బి6 తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది. అరటి, పిస్తా వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ B6 తగినంత పరిమాణంలో శరీరానికి అందుతుంది.

World Malaria Day: మలేరియా వ్యాధిని లైట్ తీసకోకండి.. ఇది వ్యాపించకుండా ఏం చేయాలంటే..!

Digestive problems: వేసవిలో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించేయండి!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 24 , 2024 | 04:19 PM