Share News

Eye Care: ల్యాప్‌టాప్ చూస్తుంటే కంటి నుంచి నీళ్లు వస్తున్నాయా.. ఈ టిప్స్ మీ కోసం..

ABN , Publish Date - Nov 25 , 2024 | 06:09 PM

ల్యాప్‌టాప్‌ స్రీన్‌ చూస్తూంటే కళ్లు మంటగా అనిపిస్తున్నాయా? కళ్ల నుంచి నీరు కారుతుందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీ కళ్లు సేఫ్‌గా ఉంటాయి.

Eye Care: ల్యాప్‌టాప్ చూస్తుంటే కంటి నుంచి నీళ్లు వస్తున్నాయా.. ఈ టిప్స్ మీ కోసం..
Eye care

Eye Care: ప్రస్తుత కాలంలో దాదాపు రోజంతా చాలా మంది ల్యాప్‌టాప్, ఫోన్ల స్క్రీన్ల మీదే ఉంటున్నారు. పిల్లలు సైతం ఫోన్లూ, ల్యాప్‌టాప్‌ లేకపోతే చదివేలా కనిపించడం లేదు. డిజిటల్ స్క్రీన్ ముందు మనం గడిపే సమయం ఎక్కువైంది. దీని కారణంగా మన కళ్లు ఎక్కువగా ఎఫెక్ట్‌ అవుతాయి. మరి ఈ టిప్స్ ద్వారా మన కళ్లను జాగ్రత్తగా కాపాడుకుందాం..

20-20-20 రూల్..

మన ఒంటికే కాదు కళ్లకు కూడా వ్యాయామం కావాలి. అవి ఆరోగ్యంగా ఉండటానికి ఎక్సర్‌సైజ్ చాలా అవరసం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. స్క్రీన్‌ మీది నుంచి దృష్టిని మరల్చి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఇతర వస్తువులను చూడండి.

దూరంగా పెట్టుకోండి..

చాలా మంది డిజిటల్‌ స్క్రీన్‌ను దగ్గరగా పెట్టుకుని ఎక్కువగా పని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గంటలు గంటలు కూర్చుని పని చేసేవారు ల్యాప్‌టాప్ ని కళ్ల నుంచి 25 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. వీటితో కళ్ల మీద పడే ఒత్తిడిని, కాంతి తీవ్రతను చాలావరకు మనం తగ్గించుకోవచ్చు.


సహజ వెలుతురులో..

ఎల్‌ఈడీ, ట్యూబ్ లైట్లను ఉపయోగించడం కంటే సహజ కాంతిలో ల్యాప్‌టాప్ లో పని చేయడం మీ కళ్లకు మంచిది. మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. సూర్యరశ్మి తలుపులు, కిటికీల ద్వారా మీ గదిలోకి ప్రవేశించినప్పుడు పని చేయండి. అది మీ కళ్ళకు విశ్రాంతినిస్తుంది.

గ్యాప్ తీసుకోండి..

కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ముందు పనిచేసేవారు గంటకోసారి కనీసం 5 నిమిషాల సేపైనా విరామం తీసుకోవాలి. దీంతో కళ్ల మీద ఒత్తిడి మాత్రమే తగ్గటం కాదు, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. గంటల తరబడి ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోకుండా.. మధ్యమధ్యలో బ్రేక్ తీసుకుంటే.. మీ కళ్లకు ఎంతో మంచిది.

బ్రైట్‌నెస్‌ అడ్జస్ట్‌ చేసుకోవాలి..

స్క్రీన్ పొజిషన్, బ్రైట్‌నెస్‌ మీకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవడం ఉత్తమం. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల బ్రైట్‌సెన్‌ తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా మీ కళ్ల పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

ఫాంట్‌ సైజ్ పెద్దగా పెట్టాలి..

ఫాంట్ సైజ్ పెద్దగా చేసుకోవాలి. చిన్న ఫాంట్లను చదివేటప్పుడు దృష్టి మరింత ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి కళ్లు త్వరగా ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి ఫాంట్స్‌ పెద్దగా ఉండేలా పెట్టుకోవాలి.

రెప్పలు వేయడం మరవద్దు..

కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ చూస్తూ కంటి రెప్పలు వేయడం మర్చిపోతే కంటి నుంచి నీళ్లు వస్తాయి. కాబట్టి తరచూ రెప్పలను ఆడించటం అలవాటు చేసుకోవాలి. దీంతో కళ్ల నుంచి నీరు రావడం, కళ్లు పొడిబారటం వంటి సమస్యలు తగ్గుతాయి.

Also Read:

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇలానే అభివృద్ధి చెందాయి..

Updated Date - Nov 25 , 2024 | 06:10 PM