Face mapping: ముఖం మీద కొన్ని ప్రాంతాలలోనే మొటిమలు ఎందుకు వస్తాయి? దీనికి కారణాలేంటంటే..!
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:05 PM
ముఖంపై మొటిమలు రావడం చాలా సాధారణం. కానీ దాని కారణాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. కొన్నిసార్లు మొటిమలు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు వస్తున్నాయో చాలామందికి అర్థం కాదు. ఫేస్ మ్యాపింగ్ ఈ విషయంలో సహాయపడుతుంది. ముఖంపై మొటిమలు రావడం వెనుక..
మొటిమలు ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఫేస్ చేస్తుంటారు. ముఖంపై మొటిమలు రావడం చాలా సాధారణం. కానీ దాని కారణాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. కొన్నిసార్లు మొటిమలు ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు వస్తున్నాయో చాలామందికి అర్థం కాదు. ఫేస్ మ్యాపింగ్ ఈ విషయంలో సహాయపడుతుంది. ముఖంపై మొటిమలు రావడం వెనుక కారణం చర్మానికి సంబంధించినది కాదు. ఇది శరీర అంతర్గత ఆరోగ్యానికి సంబంధించినది. శరీరంలోని ఏ భాగానికి ఆటంకం ఏర్పడిందో, అది చర్మంలోని ఏ భాగానికి అనుసంధానంగా ఉంటుందో అక్కడ మొటిమలు వస్తాయి. ఇలా చర్మానికి, శరీరం లోపల ఏర్పడిన సమస్యను వివరించే విధానాన్ని ఫేస్ మ్యాపింగ్ అంటారు.
వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!
ఫేస్ మ్యాపింగ్ లేదా ఫేషియల్ మ్యాపింగ్ ముఖంపై మొటిమల గాయాల నమూనాను గుర్తించడానికి ఒక పద్ధతి. ఇది శరీరంలో సమస్యలను గుర్తించడంలో, వాటికి చికిత్స తీసుకోవడంలో సహాయపడుతుంది. ఫేస్ మ్యాపింగ్ దాదాపు 3వేల సంవత్సరాల కిందటి చర్మ విశ్లేషణ పద్దతి అని అంటున్నారు.
ముఖం శుభ్రంగా కడుక్కోనప్పుడు మొటిమలు ముఖంపై కనిపిస్తాయి. దాని కారణంగా చర్మ రంధ్రాలు బ్లాక్ అవుతాయి. చర్మంలో ఎలాంటి సమస్య వచ్చినా ముఖంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. మొటిమలు వచ్చాయంటే శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థం.
నుదిటిపై మరియు వెంట్రుకలపై దద్దుర్లు వస్తున్నట్లయితే జీర్ణవ్యవస్థ సరిగా లేదని అర్థం. అలాగే హెయిర్‌లైన్‌పై దద్దుర్లు రావడం ఒత్తిడిలో ఉండటాన్ని సూచిస్తుంది. దీని కారణంగా హార్మోన్ల అసమతుల్యత సంభవిస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ వంటి ఆండ్రోజెనిక్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి.
బుగ్గలపై దద్దుర్లు ఉంటే శ్వాస సమస్యలు ఉన్నాయని అర్థం. అంటే శ్వాసకోశ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి.
గడ్డం, కనుబొమ్మల పై మొటిమలు వస్తే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.ఆహారపు అలవాట్లు మెరుగు పరుచుకోవాలి. అలెర్జీ ఆహారాలకు దూరంగా ఉండాలి.
జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!
ముక్కుపై మొటిమలు కనిపిస్తే కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఈ దద్దుర్లు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ గా రూపాంతరం చెందుతాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులతో పాటు అధిక రక్తపోటు సమస్యలను సూచిస్తాయి.
నుదిటిపై సన్నని గీతలు, ముడతలు కనిపిస్తే లేదా కళ్లలో వాపు కనిపించినట్లయితే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని సంకేతం.
గొంతు మీద ఎర్రగా ఉండటం రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. చాలా ఒత్తిడిలో ఉన్నారని, కాలేయం లేదా ఊపిరితిత్తుల సంబంధిత సమస్య కూడా ఉండవచ్చని సూచిస్తుంది.
దవడ రేఖ, వెంట్రుకలపై మొటిమలు కనిపిస్తే, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉందని అర్థం.
25 ఏళ్ల తర్వాత కూడా మొటిమల సమస్య కొనసాగితే కాలేయంలో సమస్య ఉందని అర్థం.
నుదుటిపై మొటిమలు ఉంటే, చుండ్రు లేదా తలపై మురికి లేదా కడుపు శుభ్రంగా లేదని అర్థం. ఇది కాకుండా PCOS కూడా దీనికి కారణం కావచ్చు.
జామ ఆకుల కషాయం తాగితే జరిగే మేలు ఎంతంటే..!
ఎముకలు ఉక్కులా దృఢంగా మారాలంటే ఇవి అలవాటు చేసుకోండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.