Share News

Health Tips: ఆహరం తీసుకునేటప్పుడు, తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి..

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:04 PM

నీరు తాగడం శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, ఆహారం తీసుకునేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగొచ్చా? అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Health Tips: ఆహరం తీసుకునేటప్పుడు, తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి..
Water

Water: నీరు తాగడం శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, ఆహారం తీసుకునేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగొచ్చా? అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆహారం తిన్న వెంటనే చాలా మంది నీరు తాగుతుంటారు. అయితే, అలా నీళ్లు తాగడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

ఫుడ్ తినేటప్పుడు లేదా తిన్న వెంటనే నీరు తాగితే తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదని వారు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫుడ్ తిన్న తర్వాత ఆహారం జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. మీరు ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే అది శరీరంలో ఎంజైములు, ఆమ్లాలను పలుచన చేస్తుంది. దీని వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఈ కారణంగా అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఫుడ్ తీసుకున్న వెంటనే నీరు తాగకూడదని నిపుణులు వివరిస్తున్నారు.


అనేక వ్యాధులు..

ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగడం వల్ల ఫుడ్ కొంత జీర్ణం కాకుండా మిగిలిపోతుంది. ఇది కొవ్వు రూపంలో నిల్వ అయి ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ క్రమంలోనే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే బరువు పెరుగుతారు. తిన్న వెంటనే నీరు తాగితే ఆహారంలో ఉండే పోషకాలను పలుచన చేస్తుంది. దీని కారణంగా పోషకాల లోపంతో బాధపడవచ్చు. అంతేకాకుండా అనేక వ్యాధుల బారిన పడవచ్చు.

అరగంట తర్వాత..

అందుకే ఆహారం తీసుకునే అరగంట ముందు, ఫుడ్ తీసుకునేటప్పుడు నీరు తీసుకోవడం మంచిది కాదు. ఫుడ్ తీసుకున్న అరగంట తర్వాత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు లేదా మామూలు నీరు తీసుకుంటే ఎంతో మంచిది. నీరు ఎక్కువగా తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

Updated Date - Nov 28 , 2024 | 06:10 PM