Cardamom: ఏలకులు రుచికి, సువాసనకే కాదు.. ఇలా వాడితే బోలెడు ఆరోగ్యం..!
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:00 PM
ఏలకులు ఆహారంలో ప్రధానంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం. అటు మసాలా వంటల్లోనూ, ఇటు స్వీట్లు, పాయసాలలోనూ ఉపయోగించే ఏలకులు కేవలం రుచికి, సువాసనకే కాదు..
ఏలకులు ఆహారంలో ప్రధానంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం. అటు మసాలా వంటల్లోనూ, ఇటు స్వీట్లు, పాయసాలలోనూ ఉపయోగించే ఏలకులు కేవలం రుచికి, సువాసనకే కాదు.. ఆరోగ్యానికి బోలెడు లాభాలు చేకూరుస్తాయి. ఆరోగ్యం కోసం ఏలకులను ఎలా ఉపయోగించాలో.. ఎలా ఉపయోగిస్తే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయో తెలుసుకుంటే..
ఎలా ఉపయోగించాలి..
ఏలకులను నీటిలో వేసి ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందుకోసం ఏలకులను బాగా దంచి ఒక గ్లాసు నీటిలో వేయాలి. రాత్రంతా ఈ నీటిని అలాగే ఉంచి ఉదయాన్నే తాగాలి. లేదంటే ఏలకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
ప్రయోజనాలు..
ఏలకుల నీరు కళ్లను చల్లబరుస్తుంది. కళ్ల చికాకు, దురద తగ్గించడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటి సంబంధ సమస్యలు ఉన్నవారు ఏలకుల నీటిని తాగితే మంచిది.
కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గించడంలోనూ ఏలకుల నీరు ప్రభావవంతంగా ఉంటుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి కూడా ఏలకుల నీరు మంచిది. ఏలకులను పొడిగా చేసి నీటిలో వేసుకుని తాగాలి. ఏలకులలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఏలకులు కలిపిన నీటితో స్నానం చేస్తే చాలా రిలాక్స్ గా ఉంటుంది. ముఖ్యంగా చర్మం చికాకు, మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఏలకుల సువాసన కారణంగా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ వాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
Parenting: పిల్లల పెంపకంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. పిల్లలు దూరమవుతారు..!
శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపడానికి చాలా రకాల పానీయాలు తాగుతుంటారు. ఏలకుల నీరు కూడా ఇలాంటిదే. ఏలకుల నీరు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శరీరం శుద్ది అవుతుంది.
నోటి ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారు ఏలకులను తీసుకుంటూ ఉంటే మంచిది. ఏలకుల నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. నోటి ఆరోగ్యం బాగుంటుంది.
ఈ సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు..!
అంజీర్ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.