Share News

Hyderabad: నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం.. అని చెప్పి పత్తాలేకుండాపోయాడు..

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:41 AM

నీవంటే నాకు ఇష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం... అని చెప్పి కొన్నాళ్ల తరువాత మోసం చేసి వెళ్లాడని ఓ మహిళ మధురానగర్‌ పోలీ్‌సస్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది.

Hyderabad: నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం.. అని చెప్పి పత్తాలేకుండాపోయాడు..

- కలిసి జీవిద్దామని మోసం చేశాడు

- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హైదరాబాద్: నీవంటే నాకు ఇష్టం.. పెళ్లి చేసుకొని కలిసి జీవిద్దాం... అని చెప్పి కొన్నాళ్ల తరువాత మోసం చేసి వెళ్లాడని ఓ మహిళ మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదిగ్రామానికి చెందిన మహిళకు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గజపతి జిల్లాకు చెందిన నారాయణ అనే వ్యక్తితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. దంపతులిద్దరూ జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. నారాయణ నగరానికి వచ్చిన కొంత కాలానికి మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్త నుంచి 2020లో విడిపోయి యూసుఫ్‏గూడ(Yusuf Guda) యాదగిరినగర్‌లో ఉంటూ సినిమా షూ టింగ్‌లకు హెయిర్‌, మేకప్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. అక్కడే కెమెరా అసిస్టెంట్‌గా పని చేసే యల్నాటి శ్యామ్‌కుమార్‌ పరిచయమయ్యా డు. అతడితో చనువు పెరిగింది. ఈ నేపథ్యంలో ‘నీవంటే నాకు ఇష్టం.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. కలిసి జీవిద్దాం’ అని చెప్పి... రెండేళ్లుగా ఆమెతో సహ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం నుంచి ఆమెను కొట్టటం మొదలు పెట్టాడు. వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. ఈనెల 4న ఉదయం శ్యామ్‌కుమార్‌ తల్లిదండ్రులు, మామ, బావమరిది వచ్చి మాట్లా డి శ్యామ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకొస్తామని తీసుకెళ్లారు. రాత్రి వరకు రాకపోవడమే కాకుండా ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా శ్యామ్‌కుమార్‌ ఫోన్‌ తీయకపోవడంతో అతడి బావమరిదికి ఫోన్‌ చేసింది. అతను ఫోన్‌ తీసి శ్యామ్‌ మీ ఇంటికి రాడు.. ఏమి చేసుకుంటావో చేసుకో అని సమాదానం చెప్పాడు. దీంతో ఆ మహిళ మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

city4.2.jpg

Updated Date - Mar 08 , 2024 | 11:41 AM