Share News

Crime: ఫార్చునర్ కారు కట్నం కింద ఇవ్వలేదని ఇంత ఘోరమా?.. పెళ్లైన రెండేళ్లలోపే భర్త, అత్తమామలు చేసిన దారుణమిదీ..!

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:32 PM

తల్లిదండ్రుల దగ్గర యువరాణిలా పెరిగిన కూతురామె. ఎన్నో ఆశలతో పెళ్ళిచేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. కానీ రెండేళ్లు తిరిగేసరికి జరిగింది ఇదీ..

Crime: ఫార్చునర్ కారు కట్నం కింద  ఇవ్వలేదని ఇంత ఘోరమా?.. పెళ్లైన రెండేళ్లలోపే భర్త, అత్తమామలు చేసిన దారుణమిదీ..!

తల్లిదండ్రుల దగ్గర యువరాణిలా పెరిగిన కూతురామె. ఎన్నో ఆశలతో పెళ్ళిచేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. తమ కూతురికి ఎలాంటి లోటు రాకూడదని, అత్తారింట్లో తను సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆమె తల్లిదండ్రులు కూడా తమ స్థాయికి మించి కట్నకానుకలు ఇచ్చుకున్నారు. కానీ వాటితో వరుడు, అతని కుటుంబ సభ్యులు తృప్తి పడలేకపోయారు. అదనపు కట్నం కింద ఫార్చునర్ కారు కావాలంటూ వేధించడం మొదలు పెట్టారు. వారి డిమాండ్ తీరకపోవడంతో చివరికి పెళ్లైన రెండేళ్లలోపే ఆమె ప్రాణాలను బలితీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసిన వరకట్నపు హత్య ఇది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం, గ్రేటర్ నోయిడా నగరంలో అదనపు కట్నంకు సంబంధించి హత్యకేసు వెలుగు చూసింది. కరిష్మా అనే మహిళకు 2022లో వికాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం సమయంలో కరిష్మా తల్లిదండ్రులు కట్నకానుకల రూపంలో రూ.11లక్షల నగదు, ఒక SUV కారును వరుడికి ఇచ్చారు. వివాహం అనంతరం వికాస్ కుటుంబంతో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3లోని ఖేడా చౌగన్పూర్ గ్రామంలో నివసించడం మొదలుపెట్టారు. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నంతో వికాస్ , అతని కుటుంబసభ్యులు తృప్తి పడలేదు. దీంతో అదనపు కట్నం కావాలంటూ కరిష్మాను వేధించడం మొదలుపెట్టారు. ఇంతలోనే కరిష్మా గర్భవతి కావడంతో వికాస్ మారతాడని కరిష్మాతో పాటూ ఆమె తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. కానీ కరిష్మాకు ఆడపిల్ల పుట్టడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

ఇది కూడా చదవండి: దాల్చిన చెక్క నీరు తాగితే ఆరోగ్యానికి ఇన్ని లాభాలుంటాయని తెలుసా?


dr.jpg

కూతురిని అల్లుడు, అత్తమామలు వేధిస్తుంటే చూడలేక కరిష్మా తల్లిదండ్రులు వికాస్ కు మరొక రూ.10లక్షలు అదనపు కట్నంగా ఇచ్చారు. అయితే వికాస్ కుటుంబం దీంతో కూడా తృప్తి పడలేదు. తమకు మరో రూ.21లక్షలు డబ్బు, ఫార్చునర్ కారు కావాలంటూ కరిష్మాను, ఆమె తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. వారి డిమాండ్ తీరకపోవడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కరిష్మా నుండి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. తనను తన భర్త, అత్తమామలు కొడుతున్నారంటూ కరిష్మా ఫోన్ లో తన తల్లిదండ్రులకు చెప్పింది. కరిష్మా తల్లిదండ్రులు హుటాహుటిన అల్లుడి ఇంటికి చేరుకోగా అక్కడ కరిష్మా విగతజీవిగా కనిపించింది. దీంతో కరిష్మా తల్లిదండ్రులు వికాస్ మీద అతని తల్లిదండ్రులు, సోదరులు, సోదరిల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 02 , 2024 | 02:32 PM