Share News

Chennai: వామ్మో.. చెత్తకుండీలో మనిషి ఎముకలు..

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:53 PM

స్థానిక తిరుమంగళం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో చెత్తకుండీలో పడేసిన మనిషి ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Chennai: వామ్మో.. చెత్తకుండీలో మనిషి ఎముకలు..

చెన్నై: స్థానిక తిరుమంగళం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో చెత్తకుండీలో పడేసిన మనిషి ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమంగళం ప్రాంతంలో ఉన్న బజారుకు వెళుతున్న స్థానికులు ఓ చెత్తకుండీ నుంచి దుర్వాసన వస్తుండడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, చెత్తకుండీలో మనిషి పుర్రె, చేయి, కాలికి సంబంధించిన ఎముకలను గుర్తించి స్వాధీనం చేసుకుని, ఘటనపై విచారణ చేపట్టారు.

Updated Date - Feb 25 , 2024 | 01:53 PM