Share News

Byjus Crisis: అసలు బైజుస్ నుంచి రవీంద్రన్‌ను ఎందుకు తొలగించారు? ఏం జరిగింది, నెక్ట్స్ ఏంటి ?

ABN , Publish Date - Feb 24 , 2024 | 08:34 AM

ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ సంక్షోభం శుక్రవారం మరింత పెరిగి చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీ EGMలో కంపెనీ వ్యవస్థాపక CEO బైజు రవీంద్రన్, అతని కుటుంబ సభ్యుల తొలగింపునకు వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు వేసి తీర్మానించారు.

Byjus Crisis: అసలు బైజుస్ నుంచి రవీంద్రన్‌ను ఎందుకు తొలగించారు? ఏం జరిగింది, నెక్ట్స్ ఏంటి ?

ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ సంక్షోభం(Byjus Crisis) శుక్రవారం మరింత పెరిగి చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీ EGMలో కంపెనీ వ్యవస్థాపక CEO బైజు రవీంద్రన్, అతని కుటుంబ సభ్యుల తొలగింపునకు వాటాదారులు ఏకగ్రీవంగా ఓటు వేసి తీర్మానించారు. దీంతో కంపెనీ నుంచి రవీంద్రన్(Raveendran) వైదొలగడం ఖాయమైంది. దీనికి తోడు బైజూస్‌ కొనుగోలు చేసిన కంపెనీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని కూడా తీర్మానించింది.

ఆన్‌లైన్ విద్యా ప్రపంచంలో మకుటం లేని రారాజుగా పేరుగాంచిన బైజు రవీంద్రన్ వివాదాల కారణంగా సింహాసనం నుంచి దిగివచ్చారు. కంపెనీ వాల్యుయేషన్ నిరంతరం పడిపోతోంది. కేవలం రెండేళ్లలో కంపెనీ 22 బిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ క్షీణతకు, కంపెనీ పెట్టుబడిదారుల నుంచి బోర్డు సభ్యులు, వాటాదారుల వరకు అందరూ రవీంద్రన్ తప్పుడు విధానాలను నిందిస్తున్నారు. ఈ కారణంగా కంపెనీ అసాధారణ సాధారణ సమావేశం (EGM) శుక్రవారం జరిగింది. బైజు మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ బోర్డు నుంపవ బైజు రవీంద్రన్, అతని కుటుంబాన్ని తొలగించడానికి అనుకూలంగా ఏకగ్రీవంగా ఓటు వేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Google Pay: జూన్‌ నుంచి గూగుల్ పే బంద్.. ఈ నెలలోనే మనీ డ్రా చేసుకోండి!


ఫ్యామిలీ మొత్తం

అయితే కంపెనీని కాపాడేందుకు బైజు రవీంద్రన్ అన్నింటినీ పణంగా పెట్టారు. ఇటీవల అతను తన ఇంటిని తనఖా పెట్టి రూ.100 కోట్లు సేకరించాడు. అయితే అతను నిబంధనలకు వ్యతిరేకంగా 40 కోట్ల డాలర్ల వ్యక్తిగత రుణం(loan) తీసుకుని ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించాడు. అయినప్పటికీ కంపెనీ సంక్షోభం నుంచి కోలుకోలేదు. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు అతనిని కంపెనీ నుంచి బయటకు పంపించారు. బైజు రవీంద్రన్ కుటుంబానికి కంపెనీలో 26 శాతం వాటా ఉంది. రవీంద్రన్‌తో పాటు అతని భార్య, సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్, అతని సోదరుడు రిజు రవీంద్రన్‌కు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి. EGM కోసం 30 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న వాటాదారులను మాత్రమే పిలిచారు. వీరంతా బైజు కుటుంబాన్ని కంపెనీ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారు.

గతంలో కూడా ఆరోపణలు

బైజూ కంపెనీపై గతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారిస్తోంది. ఈ క్రమంలో బైజూస్ రూ.9,000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కంపెనీ సీఈవోగా ఉన్న రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా నిషేధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఏప్రిల్‌లో రవీంద్రన్ ఇల్లు, బైజూ కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. అయితే వీటిపై కూడా విచారణ కొనసాగుతుంది.


ట్యూషన్ స్థాయి నుంచి

కేరళ(kerala)కు చెందిన బైజు రవీంద్రన్, తండ్రి ఫిజిక్స్, మ్యాథ్ టీచర్. రవీంద్రన్ బాల్యం పేదరికంలో గడిచింది. స్వయంగా పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పట్టా పొందిన రవీంద్రన్ ఓ కంపెనీలో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. 2007లో బైజు రవీంద్రన్ వరుసగా రెండు CAT పరీక్షల్లో 100 పర్సంటైల్ స్కోర్ సాధించడంతో అతని అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన గురించే సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. విద్యార్థులకు క్యాట్‌ ప్రిపరేషన్‌ అందించేందుకు ఓ ఎడ్యుకేషన్‌ కంపెనీని ప్రారంభించాడు. 2011లో రవీంద్రన్ స్వయంగా ఉపాధ్యాయురాలైన దివ్య గోకుల్‌నాథ్‌ను వివాహం చేసుకున్నారు. దివ్య సలహా మేరకు 2015లో రవీంద్రన్ ఆన్‌లైన్ విద్యను అందించే థింక్ అండ్ లెర్న్ కంపెనీని స్థాపించారు. దీని తరువాత, 2015లో అతను తన భార్యతో కలిసి బైజస్ యాప్‌ను ప్రారంభించాడు.

పెట్టుబడులు, విచారణ

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో బైజు రవీంద్రన్(Raveendran) కంపెనీ విలువ దాదాపు 22 బిలియన్ డాలర్లు (1.89 వేల కోట్ల రూపాయలు). అయితే ఇప్పుడు అది కేవలం 1 బిలియన్ డాలర్లకు తగ్గింది. రవీంద్రన్ స్వయంగా, అతని కుటుంబానికి $3.3 బిలియన్ల ఆస్తులు ఉన్నట్లు అంచనా. విద్యా రంగంలో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడిగా పరిగణించబడ్డాడు. అతను ప్రపంచ బిలియనీర్లలో 994వ స్థానంలో నిలిచాడు. మరోవైపు కర్ణాటక హైకోర్టు మార్చి 13న ఈ కేసుపై విచారణ జరపనుంది. అప్పటి వరకు ఈ తీర్మానాల అమలు పక్కన పెట్టాలని హైకోర్టు కోరింది. దీంతో మార్చి 13న హైకోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Feb 24 , 2024 | 10:30 AM