Share News

Bumper Offer: రూ. 49 కే 20 జీబీ డేటా ఫ్రీ.. ప్లాన్ వివరాలు మీకోసం..

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:23 AM

VI Rechage Plans: ఉగాది(Ugadi) పర్వదినం వేళ విఐ(వొడాఫోన్-ఐడియా)(VI Recharge Plan) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విఐ తన రూ. 49 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ని అప్‌గ్రేడ్ చేసింది. రూపాయి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా.. అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

Bumper Offer: రూ. 49 కే 20 జీబీ డేటా ఫ్రీ.. ప్లాన్ వివరాలు మీకోసం..
VI Recharge Plans

VI Rechage Plans: ఉగాది(Ugadi) పర్వదినం వేళ విఐ(వొడాఫోన్-ఐడియా)(VI Recharge Plan) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విఐ తన రూ. 49 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ని అప్‌గ్రేడ్ చేసింది. రూపాయి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా.. అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. 6జీబీ నుంచి 20 జీబీ డేటా(Interent) అందిస్తోంది. ఐపీఎల్(IPL 2024) సీజన్ వేళ ఈ ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఓసారి తెలుసుకుందాం..

ప్రస్తుతం టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్ మంచి మంచి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనే విఐ కూడా నిలుస్తోంది. తాజాగా తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్ సీజ్ వేళ కొత్త యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు రూ. 49తో రీచార్జ్ చేసుకుంటే.. 6 జీబీ డేటా వచ్చేది. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్‌ని అప్‌గ్రేడ్ చేసింది విఐ. కేవలం రూ. 49తో రీచార్జ్ చేసుకుంటే చాలు.. 20 జీబీ డేటా అందిస్తోంది. ఈ డేటాను కస్టమర్లు పూర్తిగా వినియోగించుకోవచ్చు.

షరతులు వర్తిస్తాయి..

రూ. 49తో రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ ఒక్కరోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయం కూడా ఉండదు. ఇంత తక్కువ ధరకే 20 జీబీ డేటా ఇవ్వడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రస్తుత పోటీ మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా విఐ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీనిని రీచార్జ్ చేసుకున్న రోజున అర్థరాత్రి 11:59 నిమిషాలకు ప్లాన్ గడువు ముగుస్తుంది. అందుకే.. దీని ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే.. అర్థరాత్రి దాటిన తరువాత రీచార్జ్ చేసుకుంటే.. సరిగ్గా 24 గంటల పాటు, పూర్తి స్థాయిలో డేటాను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

ఈసీ సంచలన నిర్ణయం.. సీఎం జగన్‌కు బిగ్ షాక్..!

ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 11:23 AM