Share News

Tata Punch EV: టాటా పంచ్ EV కార్ల కోసం బుకింగ్స్ షురూ..రేటు కూడా తక్కువే!

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:26 PM

టాటా(Tata) ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ ఇటివలనే మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు ఎంత రేటు ఉంది, దీని ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tata Punch EV: టాటా పంచ్ EV కార్ల కోసం బుకింగ్స్ షురూ..రేటు కూడా తక్కువే!

టాటా(Tata) ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ జనవరి 5, 2024 నుంచి ప్రారంభమైంది. మీరు టాటా ఈ కొత్త మైక్రో ఎలక్ట్రిక్ SUVని 21000 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ఈ కార్ ఫీచర్లను గురించి ఇక్కడ చుద్దాం.


ఇది యాక్టివ్ ఆర్కిటెక్చర్ ఆప్టిమైజ్ టెక్నాలజీతో చేయబడిన బ్యాటరీ ప్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ఆధారంగా వాహనాల సింగిల్ చార్జ్ బ్యాటరీ పరిధి 300 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. Acti.ev ఆర్కిటెక్చర్ ఆధారంగా వీల్ డ్రైవింగ్, వెనుక చక్రాలు, ఫార్వర్డ్ వీల్ డ్రైవ్‌ట్రెయిన్ అందుబాటులో ఉంది. యాక్టివ్ ఆర్కిటెక్చర్ AC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW నుంచి 11kW ఆన్ బోర్డ్ ఛార్జర్‌ తోపాటు DC ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 150kW వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు కేవలం 10 నిమిషాలు ఈ వాహనం ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే దీని ధర రూ.12 లక్షల నుంచి 14 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉండవచ్చని డీలర్స్ చెబుతున్నారు. ఫిబ్రవరిలో షోరూమ్‌లలో అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: MS Dhoni: ఫంక్షన్‌లో హుక్కా పీలుస్తూ కనిపించిన ధోనీ.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో!


ఈ మోడల్ కారు ADAS స్థాయి 2 సామర్థ్యాలను కలిగి ఉండటమే కాకుండా, ADAS L2+ సామర్థ్యాలకు సపోర్ట్ చేసే విధంగా భవిష్యత్తులో సిద్ధంగా ఉంది. 5G సపోర్ట్ కనెక్టివిటీతో అధునాతన నెట్‌వర్క్ వేగాన్ని అనుమతిస్తుంది. వెహికల్ 2 లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. యాక్టివ్‌లో క్లౌడ్ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు బహుళ బాడీ స్టైల్‌లను కలిగి ఉంటాయి. అంతేకాదు ఇవి గ్లోబల్ NCAP, Bharat NCAP భద్రతా ప్రోటోకాల్‌లను పాటిస్తున్నాయి. ఇందులో మెరుగైన క్యాబిన్ స్పేస్‌తో పాటు డ్రైవింగ్ డైనమిక్ సపోర్ట్ ఉంది.

Updated Date - Jan 07 , 2024 | 12:26 PM