Share News

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్!

ABN , Publish Date - May 27 , 2024 | 04:12 PM

దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలను మూటగట్టుకుంది.

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్!
Stock Market

దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 600 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలను మూటగట్టుకుంది. నిఫ్టీ కూడా 23 వేల ఎగువకు చేరుకుని మళ్లీ దిగజారింది. చివరకు స్వల్ప నష్టంతో సెన్సెక్స్ రోజును ముగించింది. (Business News).


శుక్రవారం ముగింపు (75,410)తో పోల్చితే దాదాపు 200 పాయింట్ల లాభంతో సోమవారం ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు అదే జోరు చూపించింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడి 76,009 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని కూడా తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో గరిష్టాల నుంచి దాదాపు 850 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ సోమవారం 75,175-76,009 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,390 వద్ద రోజును ముగించింది.


ఇక, నిఫ్టీ కూడా భారీ లాభాలను ఆర్జించి ఒక దశలో 23,110 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరకు 24 పాయింట్ల నష్టంతో 22,932 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 310 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 337 పాయింట్లు ఆర్జించింది. సెన్సెక్స్‌లో గ్లెన్‌ మార్క్, అశోక్ లేలాండ్, జుబిలెంట్ ఫుడ్, పెర్సిస్టెంట్ తదితర షేర్లు లాభపడ్డాయి. సన్ టీవీ, అరబిందో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మనప్పురం ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 83.13 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే


విమాన ప్రయాణం మరింత భారం


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2024 | 04:12 PM