Share News

Stock Market: రెండో రోజూ నష్టాల్లోనే.. అప్రమత్తంగా కదలాడిన సూచీలు..!

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:18 PM

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరిన్ని దేశాలకు విస్తరించవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు.

Stock Market: రెండో రోజూ నష్టాల్లోనే.. అప్రమత్తంగా కదలాడిన సూచీలు..!
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరిన్ని దేశాలకు విస్తరించవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్ నష్టాల్లోనే ముగిసింది. (Stock Market). ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు (Business News).


మంగళవారం ఉదయం 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. 72,685 వద్ద ఇంట్రాడే లోని తాకింది. చివరకు 456 పాయింట్ల నష్టంతో 72,943 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 124 పాయింట్లు కోల్పోయి 22,147 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 44 పాయింట్లు నష్టపోయింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఎయిచర్ మోటార్స్, లారస్ ల్యాబ్స్ లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్, ఎంపసిస్, గుజరాత్ గ్యాస్, కోఫోర్జ్ లిమిటెడ్ నష్టాలను మూటగట్టుకున్నాయి. శ్రీరామ నవమి కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు.

ఇవి కూడా చదవండి..

మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా మనది పేద దేశమే


ఎగుమతుల్లో క్షీణత

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 04:18 PM