Share News

Stock Market: మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు.. స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్!

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:09 PM

ప్రధాని మోదీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టడంతో లాభాలతో రోజును ప్రారంభించిన దేశీయ సూచీలు చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్ ఒక దశలో జీవన కాల గరిష్టాన్ని టచ్ చేసింది.

Stock Market: మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు.. స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్!
Stock Market

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కొలువుదీరడంతో లాభాలతో రోజును ప్రారంభించిన దేశీయ సూచీలు (Stock Market) చివరకు స్వల్పంగా నష్టపోయాయి. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టడంతో రైల్వే స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ (Sensex) చివరకు అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలను కోల్పోయింది. రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి (Business News).


సోమవారం ముగింపు (76,490)తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 76,680 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం బాగానే జోరు చూపించింది. ఒక దశలో 76,860 వద్ద ఇంట్రాడే హైని టచ్ చేసింది. మరోసారి 77 వేల మైలు రాయిని టచ్ చేస్తుందేమో అనిపించింది. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. చివరకు 33 పాయింట్ల స్వల్ప నష్టంతో 76,456 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 23,264 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో ఓఎన్‌జీసీ, జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ, పెట్రోనాట్ షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, రామ్‌కో సిమెంట్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, హిందుస్తాన్ కాపర్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 75 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టి మిడ్ క్యాప్ ఇండెక్స్ 430 పాయింట్లు లాభపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.56గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Onion Prices: సామాన్య ప్రజలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ఉల్లి ధరలు


Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2024 | 04:09 PM