Share News

Stock Market: భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 560 పాయింట్లు ప్లస్..!

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:30 PM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు జోరు చూపించాయి. ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లోనే కదలాడాయి.

Stock Market: భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు.. సెన్సెక్స్ 560 పాయింట్లు ప్లస్..!
Stock Market

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు జోరు చూపించాయి. ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లోనే కదలాడాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఇన్‌ఫ్రా రంగాల్లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి (Business News).


సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌కు రోజంతా కొనుగోళ్ల మద్దతు లభించింది . ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడింది. 73,767 వద్ద ఇంట్రాడే హైని తాకింది. చివరకు 560 పాయింట్ల లాభంతో 73,648 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 181 పాయింట్లు లాభపడి 22, 336వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 399 పాయింట్లు ఎగబాకింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా వోల్టాస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బందన్ బ్యాంక్ లాభాలను ఆర్జించాయి. పెర్సిస్టెంట్, బిర్లా సాఫ్ట్, కోరమాండల్, ఎన్‌టీపీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.36గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Aadhaar Card: ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకున్నారా.. లేదంటే మీకే నష్టం


CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2024 | 04:30 PM