Share News

Stock Market: దేశీయ సూచీల జోరు.. వరుసగా నాలుగో రోజూ లాభాలే..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:10 PM

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి.

Stock Market: దేశీయ సూచీల జోరు.. వరుసగా నాలుగో రోజూ లాభాలే..!
Stock Market

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. మదుపరులకు లాభాలను అందించాయి (Business News).


బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 74,121 వద్ద ఇంట్రాడే హైని తాకింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగిడంతో లాభాలను కోల్పోయింది. చివరకు 114 పాయింట్ల లాభంతో 73,852 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 22, 402 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 377 పాయింట్లు ఎగబాకింది.


సెన్సెక్స్‌లో ప్రధానంగా యునైటెడ్ బ్రావరీస్, సెయిల్, ఎన్‌ఎమ్‌డీసీ, చంబల్ ఫోర్ట్ లాభాలను ఆర్జించాయి. వోడాఫోన్ ఐడియా, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించకుంటే ఏమవుతుంది?


Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2024 | 04:10 PM