Share News

Youtube: యూట్యూబ్‌లో వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులొస్తాయ్?

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:49 PM

ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వీడియోల ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో అనేక మంది యూట్యూబ్(youtube) వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో కొంత మంది వారి గుర్తింపు కోసం చేస్తుంటే, మరికొంత మంది మాత్రం యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడానికి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు యూట్యూబ్ ద్వారా ఒక వీడియోకు మిలియన్ వ్యూస్(10 లక్షల)(one million views) వస్తే ఎంత డబ్బు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు చుద్దాం.

Youtube: యూట్యూబ్‌లో వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులొస్తాయ్?

ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వీడియోల ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో అనేక మంది యూట్యూబ్(youtube) వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో కొంత మంది వారి గుర్తింపు కోసం చేస్తుంటే, మరికొంత మంది మాత్రం యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడానికి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఫేమస్ అయ్యి మనీ సంపాదిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. వారిని చూసి అనేక మంది యూట్యూబ్ ఛానెళ్లు(youtube channels) క్రియేట్ చేసి డబ్బులు(money) సంపాదించాలని భావిస్తున్నారు. వీరిలో కొంత మంది సక్సెస్ కాగా, మరికొంత మంది మధ్యలోనే ఛానెళ్లను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అసలు యూట్యూబ్ ద్వారా ఒక వీడియోకు మిలియన్ వ్యూస్(10 లక్షల)(one million views) వస్తే ఎంత డబ్బు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు చుద్దాం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: రోహిత్ శర్మ ఔట్.. సంబరాలు చేసుకున్న వ్యక్తిని కొట్టి చంపిన అభిమానులు


అయితే యూట్యూబ్(YouTube) వీడియోల ద్వారా మనీ(money) సంపాదించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిలో ముందుగా మీరు క్రియేట్ చేసుకున్న ఛానెల్‌ మానిటైజ్ అవ్వాలి. అందుకోసం 1000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండాలి. దీంతోపాటు మీ ఛానెల్ తప్పనిసరిగా 4000 గంటల వీక్షణ సమయం పూర్తి అవ్వాలి. షార్ట్ వీడియోలు అయితే 90 రోజుల్లో కోటి వీక్షణలను కలిగి ఉండాలి. ఆ తర్వాత ఛానెల్‌ మానిటైజేషన్ (monetization) అవుతుంది. అప్పుడు మీరు మీ బ్యాంక్(bank) ఖాతాకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో చేసిన వీడియోలకు యాడ్స్(adds) అప్లై చేయడం ద్వారా వచ్చిన వ్యూస్ ఆధారంగా మనీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో పోస్ట్ చేసిన వీడియోలు, వ్యూస్‌ను బట్టి కనీసం 100 డాలర్ల మొత్తం దాటిన తర్వాత క్రియేటర్లకు AdSense నుంచి వారి అకౌంట్‌కు వచ్చిన మొత్తాన్ని నెలవారీగా పంపిస్తారు. మాకు లభించిన సమాచారం ఆధారంగా ఇండియాలో ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే రూ.7 వేల నుంచి 30 వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే వీడియోకు అమెరికా సహా ఇతర దేశాల ప్రజల నుంచి వ్యూస్ వస్తే ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

దేశంలో 10,000 (10k) వ్యూస్ వస్తే - రూ. 200-500

1,00,000 (100k) వ్యూస్ వస్తే - రూ. 2000-5000

10,00,000 (1 మిలియన్) వ్యూస్ వస్తే - రూ. 7000-30,000

1500,00,000 (150 మిలియన్లు) వ్యూస్ వస్తే - రూ. 1,50,000-6,00,000

YouTube AdSense ద్వారా వచ్చే సంపాదనలో 55% సృష్టికర్తకు చెల్లిస్తుంది. వచ్చిన ఆదాయంలో 45% తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి నెల వచ్చిన వ్యూస్ ఆధారంగా యూట్యూబర్లకు ఆదాయం లభిస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Alert: నేటి నుంచి మారే రూల్స్ ఇవే.. తెలుసుకోకుంటే మీకే లాస్..

Updated Date - Apr 01 , 2024 | 02:51 PM