Share News

Ola Scooter: తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే..?

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:00 PM

ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999గా ఉంది. దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దాంతో ఓలా బేసిక్ స్కూటర్ రూ.69,999 వేలకు రానుంది.

Ola Scooter: తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే..?
Ola Electric Cuts Cheapest E-Scooter Price By 12.5%

ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఓలా (Ola) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999గా ఉంది. దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దాంతో ఓలా బేసిక్ స్కూటర్ రూ.69,999 వేలకు రానుంది. ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. తర్వాత సబ్సిడీపై కోత విధించింది. అప్పటివరకు బాగా జరిగిన కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గాయి. దాంతో వాహనాల విక్రయించేందుకు ఓలా కంపెనీ తగ్గింపును ప్రకటించింది.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి


2024లో బెంగళూర్‌కు చెందిన కంపెనీ 3 లక్షల 26 వేల 443 ఓలా ఈ స్కూటర్లను విక్రయించింది. నిజానికి అక్కడ టార్గెట్ 3 లక్షల వాహనాలు విక్రయించాల్సి ఉంది. ఓలా వాహనాల కన్నా టీవీఎస్ మోటార్, అథర్ ఎలక్ట్రిక్ వాహనాల ధర రూ.లక్ష వరకు ఉన్నాయి. దేశంలో ఎక్కువగా కొనుగోలు జరుగుతున్న హోండా యాక్టివా పెట్రోల్ వెర్షన్ స్కూటీ ధర మార్కెట్‌లో రూ.78 వేల నుంచి రూ.82 వేల వరకు ఉంది. దాని కన్నా తక్కువకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.


తమ వాహనాల అమ్మకాలను పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ బేసిక్ స్కూటర్ ధరను తగ్గించింది. మిగిలిన వేరియంట్స్ 5.6 శాతం నుంచి 9.1 శాతం మధ్య తగ్గించింది. ఎస్1ఎక్స్ టాప్ మోడల్ నష్టాలకు విక్రయిస్తోందని, బేస్ వేరియంట్ ధర తగ్గించడం సరికదని ముంబైకి చెందిన విశ్లేషకుడు ఒకరు అభిప్రాయ పడ్డారు.

Stock Market: ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు!

మరిన్ని బిజెనెస్ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 07:00 PM