Share News

Ekagrah Rohan: ఇన్ఫీ నారాయణమూర్తి మనవడికి కంపెనీ షేర్లపై రూ.4.2 కోట్ల డివిడెండ్!

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:30 PM

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మంచి లాభాలు ఆర్జించిన ఇన్ఫోసిస్, మదపర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఈ క్రమంలో సంస్థ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడికి రూ.4.2 కోట్ల డివిడెండ్ అందనుంది.

Ekagrah Rohan: ఇన్ఫీ నారాయణమూర్తి మనవడికి కంపెనీ షేర్లపై రూ.4.2 కోట్ల డివిడెండ్!

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ ఇటీవల భారీగా లాభాలు ఆర్జించిన విషయం తెలిసిందే. నాలుగో త్రైమాసికంలో 30 శాతం అదనపు లాభాలు ఆర్జించినట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా షేరుకు రూ.20 చొప్పున తుది డివిడెండ్ (Infosys Dividend) కూడా ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్ కింద మరో రూ.8 కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) మనవడు ఏకాగ్రహ్ రోహన్ (Ekagrah Rohan) ఐదు నెలల వయసులోనే 4.2 కోట్ల డివిడెండ్ పొందనున్నాడు.

Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!


నారాయణమూర్తి కొడుకు రోహన్ మూర్తి కుమారుడు ఏకాగ్రహ్ అన్న విషయం తెలిసింది. నారాయణ మూర్తి కూతురు, బ్రిటన్ ప్రధాని భార్య అక్షతా మూర్తికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, నారాయణమూర్తి ఇటీవలే తన మనవడు ఏకాగ్రహ్‌కు రూ.240 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బదిలీ చేశారు. ఆఫ్ మార్కెట్‌గా జరిగిన ఈ షేర్ల బదిలీని ఆ తరువాత స్టాక్ మార్కెట్లకు తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో మంచి లాభాలు కనబరిచిన ఇన్ఫోసిస్.. షేర్ హోల్డర్లకు డివిడెండ్ ప్రకటించింది. దీంతో, మనవడికి తన వాటా కింద రూ.4.2 కోట్లు అందనున్నాయి (Narayana Murthys 5 Month Old Grandson To Pocket 4.2 Crore From Infosys Dividend).

ఇక ఇన్ఫోసిస్ ప్రకటన ప్రకారం, నాలుగో త్రైమాసికంలో సంస్థ లాభాలు 30 శాతం మేర పెరిగి రూ.7969 కోట్లకు చేరాయి. సంస్థ ఆదాయంలో కూడా స్వల్ప వృద్ధి నమోదైంది. నికర లాభాలు 8.9 శాతం పెరిగి 26,233 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు, జర్మనీకి చెందని ఇన్ టెక్ సంస్థను 450 మిలియన్ యూరోలకు ఆల్ క్యాష్ డీల్‌లో కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 1-3శాతం వృద్ధి నమోదవుతుందని కూడా సంస్థ అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 05:32 PM