Share News

Billionaires: టాప్-5 బిలియనీర్ల జాబితాలో హైదరాబాద్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 09:45 PM

ప్రపంచంలో బిలియనీర్లు జాబితాను హరున్ గ్లోబల్ రిచ్ విడుదల చేసింది. ఆ జాబితాలో భారతదేశానికి చెందిన ఐదు నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కూడా ఆ జాబితాలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధింకగా 92 మంది బిలియనీర్లు ఉన్నారు.

Billionaires: టాప్-5 బిలియనీర్ల జాబితాలో హైదరాబాద్‌

హైదరాబాద్: ప్రపంచంలో బిలియనీర్లు జాబితాను హరున్ గ్లోబల్ రిచ్ విడుదల చేసింది. ఆ జాబితాలో భారతదేశానికి (India) చెందిన ఐదు నగరాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) కూడా ఆ జాబితాలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధింకగా 92 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం ఢిల్లీ ఉంది. ఢిల్లీ 57 మంది, బెంగళూరులో 27 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 17 మంది, చెన్నైలో 14 మంది ఉన్నారు. దేశాలవారీగా చూస్తే చైనా దేశంలో 814 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం అమెరికా ఉంది. అగ్రరాజ్యంలో 800 మంది ఉన్నారు. మూడో స్థానంలో భారతదేశం ఉంది. ఇక్కడ 271 మంది బిలియనీర్లు ఉన్నారు.

హైదరాబాద్‌లో బిలియనీర్లను ఒకసారి పరిశీలిస్తే.. మురళి దివి అండ్ ఫ్యామిలీ నికర సంపద 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 381 ర్యాంక్‌లో ఉన్నారు. పిచ్చి రెడ్డి, పివి కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వర రావు అండ్ ఫ్యామిలీ, పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, బీ పార్థసారథి రెడ్డి అండ్ ఫ్యామిలీ, కే సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, జి అమరేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, వెంకటేశ్వర్లు జాస్తి అండ్ ఫ్యామిలీ, ఎం సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్యామిలీ హైదరాబాద్‌లో టాప్ 10 బిలియనీర్లుగా ఉన్నారు. వీరిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీవీ కృష్ణా రెడ్డి ఒక్కరే టాప్ 10లో చోటు దక్కిన తక్కువ వయస్సు గలవారు. 54 ఏళ్లలో ఆయన జాబితాలో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 09:45 PM