Share News

Stock Market: ఎన్నికల ఫలితంతో రూ.14,800 కోట్లు వెనక్కి.. దేశీయ స్టాక్ మార్కెట్లకు షాక్.. చైనాపై ఆశలు!

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:04 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. వరుసగా మూడో నెలలోనూ భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నారు.

Stock Market: ఎన్నికల ఫలితంతో రూ.14,800 కోట్లు వెనక్కి.. దేశీయ స్టాక్ మార్కెట్లకు షాక్.. చైనాపై ఆశలు!
FPIs selling in Indian Stock Market

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు (Election Results) అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. వరుసగా మూడో నెలలోనూ భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నారు (FPIs Selling). అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్లు (China Stock Market) ఆకర్షణీయంగా ఉండడంతో తమ పెట్టుబడులను అటు వైపు మళ్లిస్తున్నారు. జూన్ నెలలో ఎఫ్‌పీఐ‌లు ఏకంగా 14,800 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు (Business News).


మూడోసారి కూడా స్పష్టమైన ఆధిక్యతతో మోడీ (PM Modi) ప్రభుత్వం ఏర్పడుతుందని మదుపర్లు ఆశించారు. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో మోదీ హవాకు బ్రేక్ పడుతుందని మొదట్నుంచి వార్తలు వచ్చిన నేపథ్యంలో విదేశీ మదుపర్లు ఏప్రిల్ నెల నుంచే జాగ్రత్తలు ప్రారంభించారు. మే నెలలో ఏకంగా 25,586 కోట్ల అమ్మకాలు జరిపారు.


ఏప్రిల్ నెలలో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య దాడులు మొదలైన కారణాలతో అమ్మకాలు ప్రారంభించారు. ఏప్రిల్‌లో 8,671 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు చైనా మార్కెట్ ఆకర్షణీయంగా ఉండడం, చాలా స్టాక్స్ మంచి వాల్యూయేషన్‌తో దొరుకుతుండడంతో చాలా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను చైనా వైపు మళ్లిస్తున్నాయి. కాగా, పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టి, కేంద్రం తమ విధానం ఏంటో స్పష్టం చేసే వరకు మార్కెట్లో ఈ అనిశ్చితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Rate: రెండో సారి తగ్గిన బంగారం, వెండి..ఎంతకు చేరాయంటే


Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2024 | 01:04 PM