Share News

Business Idea: రూ.5 వేల పెట్టుబడి.. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:36 AM

మీరు ఎక్కువ డబ్బు అవసరం లేకుండా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీరు కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50 వేలకుపైగా సంపాదించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Business Idea: రూ.5 వేల పెట్టుబడి.. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం

మీరు ఎక్కువ డబ్బు అవసరం లేకుండా వ్యాపారం(business idea) ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీరు కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.50 వేలకుపైగా సంపాదించవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం. అయితే ఈ వ్యాపారం ఏంటంటే ట్యూషన్ బిజినెస్(tuition business). ట్యూషన్ అని తక్కువగా అంచనా వేయకండి. దీని ద్వారా అనేక మంది లక్షల్లో సంపాదించే వారు సైతం ఉన్నారు. ఇంకొంత మంది అయితే దీనిని స్టార్ట్‪‌ప్‌గా ప్రారంభి కోట్ల రూపాయలు సంపాదించారు. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరైనా కూడా చేయవచ్చా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఎవరు అర్హులు?

అయితే ఈ బిజినెస్ ప్రారంభించాలంటే మాత్రం మీకు తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టు(subject) లేదా కోర్సు(course) పై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. దీంతోపాటు ట్యూషన్ చెప్పాలని అనుకునే వారికి పీజీ స్టడీస్ లేదా బీఈడీ వంటి అర్హతలు ఉంటే ఇంకా మేలని చెప్పవచ్చు. ఈ కోర్సులు చేసిన వారికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పీజీ చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులు, గృహిణులు లేదా ప్రైవేటు ఉద్యోగులు, టీచర్స్ సహా అనేక మంది కొంత సమయాన్ని వెచ్చించి ఈ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.


పెట్టుబడి ఎంత?

ఈ బిజినెస్ ప్రారంభించేందుకు పెద్దగా ఖర్చు(expenses) అవసరం ఉండదు. ఎందుకంటే ఈ వ్యాపారానికి మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ మొదటి పెట్టబడి(investment) మార్గమని చెప్పవచ్చు. ఆ క్రమంలో ప్రతి రోజు ఇంట్లో ఓ బోర్డు ద్వారా 10వ తరగతి లోపై లేదా ఆపైన ఇంటర్ విద్యార్థులకు కూడా ట్యూషన్ చెప్పవచ్చు. దీని కోసం ఒక బోర్డు, మార్కర్ సహా వీడియో తీసేందుకు ట్రై ప్యాడ్ వంటి వాటికి 5 వేల రూపాయల్లోపే ఖర్చు అవుతుంది.

నెలకు ఆదాయం ఎంత ?

మీరు ప్రతిరోజు దాదాపు 30 మంది 10వ తరగతి లోపు లేదా ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం ద్వారా నెలకు ఒక్కొక్కరి వద్ద నుంచి కనీసం రెండు వేల చొప్పున వసూలు చేయవచ్చు. ఆ విధంగా 30 మంది ద్వారా నెలకు రూ.60 వేల వరకు సంపాదించే(income) అవకాశం ఉంది. మీకు మరింత ఎక్కువ మంది విద్యార్థులు వస్తే మీ ఆదాయం మరింత పెరుగుతుంది. అంతేకాదు మీరు చెప్పిన వీడియోలను యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేసుకుని కూడా మనీ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఆన్‌లైన్ విధానంలో కూడా ట్యూషన్ చెబుతూ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియా(social media)లో ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా అనేక మందికి తెలిసే అవకాశం ఉంటుంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Business Idea: సమ్మర్‌లో తక్కువ పెట్టుబడితో బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం

Updated Date - Mar 09 , 2024 | 11:38 AM