Share News

Bank Holidays: ఒకే నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే.. హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

ABN , Publish Date - Jan 13 , 2024 | 09:01 AM

ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు.

Bank Holidays: ఒకే నెలలో సంక్రాంతి, రిపబ్లిక్ డే.. హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

హైదరాబాద్: ఈ రోజుల్లో బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికీ ఖాతాలు ఉండడం సహజం. చాలా మందికి ఒకటికి మించే బ్యాంకు ఖాతాలున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బులను ఎవరూ ఇంట్లో దాచుకోవడం లేదు. చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం బ్యాంకులోనే దాచుకుంటున్నారు. దీంతో నెలలో కనీసం ఒకసారైన ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ వార్త. బ్యాంకులకు వెళ్లే వారంతా ఈ నెలలో బ్యాంకుల పని వేళలను చూసుకోని వెళ్లడం మంచిది. ఎందుకంటే జనవరి నెలలో బ్యాంకులకు సెలవు దినాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు ఈ విషయాన్ని గమనించగలరు. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ జనవరి నెలలో బ్యాంకులకు ఏకంగా 8 రోజులు సెలవులున్నాయి.


సంక్రాంతి పండుగ, గణతంత్ర దినోత్సవం వంటి ప్రతిష్టత్మక వేడుకలు జనవరి నెలలో ఉండడమే ఇందుకు కారణం. వీటికి తోడు రెండో శనివారాలు, ఆదివారాలు కూడా ఉండనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే జనవరి నెలలో బ్యాంకులకు ఏకంగా 17 రోజులు సెలవు దినాలున్నాయి. అన్ని రకాలకు బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు ఈ సెలవు దినాల్లో పనిచేయవు. అయితే బ్యాంకులు పని చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్ చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటివి ఎప్పటిలాగే 24 గంటలు పని చేస్తాయి.

హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు ఉండే రోజులు

జనవరి 7: ఆదివారం

జనవరి 13: రెండవ శనివారం

జనవరి 14: ఆదివారం

జనవరి 15: సంక్రాంతి

జనవరి 21: ఆదివారం

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

జనవరి 27: నాలుగో శనివారం

జనవరి 28: ఆదివారం

Updated Date - Jan 13 , 2024 | 09:05 AM