Share News

Ather 450 Apex: ఏథర్ ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:16 PM

మీరు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఏథర్(Ather) తాజాగా 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 157 కిలోమీటర్ల రేంజ్ మోడల్‌ను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Ather 450 Apex: ఏథర్ ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త స్కూటర్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే

ఏథర్(ather) ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంస్థ తన 10 ఏళ్ల సంవత్సరాల ప్రయాణం సందర్భంగా సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ క్రమంలో ఏథర్ 450 అపెక్స్‌ను కొత్త సంవత్సరంలో విడుదల చేసింది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌లో 157 కిమీల రేంజ్‌ను ఇస్తుందని తెలిపింది. అంతేకాదు దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీగా ఉంటుందని..ఇది కేవలం 2.9 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ నిర్వహకులు చెప్పారు. PMSM 7Kw బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 9.3 bhp పవర్, 26 Nm టార్క్‌ను అందిస్తుంది. గత మోడల్‌లో 6.4 Kw బ్యాటరీ ప్యాక్ ఉంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 2000 Notes Updates: మీ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయా? ఇక్కడ ఈజీగా మార్చుకోవచ్చు..!

ఈ సందర్భంగా ఈ మోడల్ కంపెనీ నుంచి వచ్చిన అధిక పనితీరు, ప్రీమియం కల్గిన ఎలక్ట్రిక్ స్కూటర్(electric scooter) అని పేర్కొన్నారు. కంపెనీ దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.188,999గా నిర్ణయించింది. ఇందులో మ్యాజిక్ ట్విస్ట్ యాక్సిలరేటర్‌ని కంపెనీ అందించింది. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్లో ఇది ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో జెన్ 2కు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. యూనిక్ బ్లూ, స్టార్క్ ఆరెంజ్ వంటి కొత్త కలర్ ఆప్షన్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. మార్చిలో డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే పరిమిత ఎడిషన్ స్కూటర్ ఫిబ్రవరిలో ఏథర్ షోరూమ్‌లలోకి వస్తుందని చెప్పారు.

Updated Date - Jan 06 , 2024 | 05:16 PM