Share News

Jiocinema: జియో సినిమా కొత్త ప్లాన్ ప్రీమియం 50 శాతం తగ్గింపు

ABN , Publish Date - May 25 , 2024 | 07:30 PM

దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారుల కోసం తగ్గింపు ధరకు ఓ ప్లాన్‌ను ప్రారంభించింది. మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కంపెనీ తన OTT ప్లాట్‌ఫారమ్ కోసం ప్రవేశపెట్టిన జియో సినిమా(Jiocinema) ప్రీమియం చౌకైన ప్లాన్‌ను ఆస్వాదించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Jiocinema: జియో సినిమా కొత్త ప్లాన్ ప్రీమియం 50 శాతం తగ్గింపు
50 percent discount on Jiocinema new annual plan

దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారుల కోసం తగ్గింపు ధరకు ఓ ప్లాన్‌ను ప్రారంభించింది. మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కంపెనీ తన OTT ప్లాట్‌ఫారమ్ కోసం ప్రవేశపెట్టిన జియో సినిమా(Jiocinema) ప్రీమియం చౌకైన ప్లాన్‌ను ఆస్వాదించవచ్చు. దీని వార్షిక ప్లాన్ ధర ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ప్రీమియం సేవల కంటే చౌకగా ఉండటం విశేషం. దీని అసలు ధర రూ.599 కాగా మీరు దీన్ని ప్రస్తుతం 50 శాతం తగ్గింపుతో పొందవచ్చు.


దీనికి మీరు కేవలం రూ.299 చెల్లించాలి. 12 నెలల సబ్‌స్క్రిప్షన్ మీ సొంతం అవుతుంది. JioCinema ప్రీమియం వార్షిక ప్లాన్ ఒకే పరికరంలో 4K రిజల్యూషన్‌తో ప్రీమియం కంటెంట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో మీరు HBO, పారామౌంట్, పీకాక్, వార్నర్ బ్రదర్స్ వంటి అనేక చిత్రాలు ప్రసారం అవుతాయి. దీనిలో మీరు కొత్త సినిమాలు, షోలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో మీరు ప్రకటనలు లేకుండా ఏదైనా షో లేదా గేమ్‌ని చూడవచ్చు.


ఇక జియో సినిమా రూ. 999 ధర ఉన్న పాత వార్షిక ప్లాన్‌ను ప్రస్తుతం నిలిపివేశారు. కొత్త ప్లాన్ ఈ ప్లాన్ కంటే చాలా చౌకగా ఉన్న క్రమంలో దీనిని ఆపేశారు. గత నెలలో JioCinema రూ. 149 ధరతో ప్రీమియం ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీనిని రూ.89కి తగ్గించారు. ప్రస్తుతం జియో సినిమా నెలవారీ ప్లాన్ రూ. 59 కాగా, వార్షిక ప్లాన్ రూ. 299గా ఉంది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు నెలవారీ ప్లాన్ కంటే మెరుగైన ఎంపికను పొందవచ్చు. కానీ 12 నెలల తర్వాత మళ్లీ ఈ ప్లాన్ తీసుకుంటే రూ.599 చెల్లించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 25 , 2024 | 07:32 PM