YCP-TDP: సీఎం సొంత జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు..
ABN , Publish Date - Feb 17 , 2024 | 09:52 AM
సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడప జిల్లాలో టీడీపీ వైపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. నిత్యం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. వైసీపీ నిరుత్సాహంలో ఉంది.
కడప : సీఎం జగన్ రెడ్డి సొంత గడ్డ అయిన కడప జిల్లాలో టీడీపీ వైపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. నిత్యం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. వైసీపీ నిరుత్సాహంలో ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పులు చేర్పులు చేపట్టినప్పటి నుంచి వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కేడర్‌లో సైతం మార్పు వచ్చింది. అలాగే వైసీపీలో వర్గపోరు సైతం తారా స్థాయికి చేరింది. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అసమ్మతి నేతలను ఎంపీ అవినాశ్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం నియమించింది.