Share News

YSR Congress Party: ఆగని వైసీపీ ఆగడాలు.. పార్టీ మారిన పాపానికి..

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:47 PM

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు ప్రతిపక్ష కార్యకర్తలు, మీడియా వాళ్లపై (Attack On Media) దాడికి పాల్పడిన వైసీపీ అల్లరి మూకలు.. తాజాగా చిత్తూరులో (Chittoor) నవీన్‌పై ఎటాక్ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ మారాడని.. ఆ అక్కసుతో అతనిపై దాడికి ఎగబడ్డారు.

YSR Congress Party: ఆగని వైసీపీ ఆగడాలు.. పార్టీ మారిన పాపానికి..

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అరాచకాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్నిసార్లు ప్రతిపక్ష కార్యకర్తలు, మీడియా వాళ్లపై (Attack On Media) దాడికి పాల్పడిన వైసీపీ అల్లరి మూకలు.. తాజాగా చిత్తూరులో (Chittoor) నవీన్‌పై ఎటాక్ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ మారాడని.. ఆ అక్కసుతో అతనిపై దాడికి ఎగబడ్డారు. ఆదివారం 100 మంది అనుచరులతో నవీన్ తెలుగుదేశం పార్టీలోకి చేరగా.. సోమవారం మధ్యాహ్నం వైసీపీ కార్యకర్తలు (YCP Leaders) అతనిపై దాడి చేశారు.


ఈ దాడిలో నవీన్‌కు తీవ్ర గాయాలవ్వడంతో.. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనపై జరిగిన దాడిపై నవీన్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పార్టీ మారినందుకే తనపై అన్యాయంగా దాడి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్‌ని టీడీపీ నాయకులు పరామర్శించారు. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అతని కోసం భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు ఆసుపత్రికి తరలివచ్చారు. అయితే.. వారితో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఆసుపత్రికి చేరుకోవడంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపు చేశారు.

ఇదిలావుండగా.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ వైసీపీ దాన్ని బేఖాతరు చేస్తూ వలంటీర్లు, ఉద్యోగులతో ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే వలంటీర్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేస్తుండగా.. తాజాగా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. వైసీపీ కండువా కప్పుకొని మరీ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇలా చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఉద్యోగులు వాటిని పట్టించుకోకుండా వైసీపీ కార్యక్రమాల్లో, ప్రచారాల్లో పాల్గొంటూనే ఉన్నారు. దీంతో.. తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 06:47 PM