Share News

పులివెందులలో చూసుకుంటా.. దస్తగిరి హాట్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:14 AM

పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పోటీ చేస్తానని వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు దస్తగిరి హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు వెలుపల మీడియాతో

పులివెందులలో చూసుకుంటా.. దస్తగిరి హాట్ కామెంట్స్..

ఏపీ పోలీసులపై నాకు నమ్మకం లేదు

తెలంగాణ పోలీసులతో రక్షణ కల్పించండి

రూ. 20 కోట్లు ఆఫర్‌ చేశారు : దస్తగిరి

హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు హాజరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై పోటీ చేస్తానని వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు దస్తగిరి హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ‘‘వైసీపీ నేతలు ఎంపీ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి నన్ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌ నన్ను కొట్టి అప్రూవర్‌ గా మార్చినట్టు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి...రామ్‌ సింగ్‌ పై ఎలాంటి ఆరోపణలు చేశారో, నేనూ అలాగే చేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు ఆఫర్‌ చేశారు’’ అని తెలిపారు. కిడ్నాప్‌ కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టిన సమయంలో దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి డాక్టర్‌ ముసుగులో జైలు లోపలకు వచ్చారని, రూ. 20 కోట్లు అడ్వాన్స్‌ కింద తీసుకోవాలని ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Feb 28 , 2024 | 09:23 AM